బాల‌య్య కోసం రెండు క‌థ‌లు

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళింది. మ‌రోవైపు బి.గోపాల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడు బాల‌య్య‌. ఈ చిత్రం కోసం రెండు క‌థ‌లు రెడీ అయ్యాయి. ఓ క‌థ‌ని బుర్రా సాయిమాధ‌వ్ అందిస్తే.. మ‌రో క‌థ చిన్ని కృష్ణ రాశారు. ఈ రెండు క‌థ‌లూ బాల‌య్య‌కు బాగా న‌చ్చాయి. అయితే అందులో దేన్ని ఫైన‌ల్ చేస్తారో ఇంకా తెలీలేదు.

స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు సినిమాల్ని బాల‌య్య అభిమానులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. తెలుగు నాట ఓ కొత్త చ‌రిత్ర సృష్టించిన చిత్రాల‌వి. ఆ క‌థ‌ల్ని అందించిన‌ది చిన్నికృష్ణ‌నే. ఇప్పుడు మ‌రోసారి ఓ శ‌క్తిమంత‌మైన క‌థ‌ని రాశార్ట‌. అయితే ఈసారి కుటుంబ బంధాలు, అనుబంధాలు, మాన‌వ సంబంధాల్ని అంత‌ర్లీనంగా ట‌చ్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు బుర్రా సాయిమాధ‌వ్‌తోనూ బాల‌య్య‌కు మంచి అనుబంధ‌మే ఉంది. బాల‌య్య వందో చిత్రం గౌత‌మిపుత్ర శాత‌కర్ణికీ, ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల‌కూ ప‌నిచేశారు బుర్రా. ఆయ‌న బాల‌య్య కోసం ఓ మాస్ క‌థ‌ని సిద్ధం చేశార్ట‌. ఈ రెండింటిలో ఒక‌టి ఫైన‌ల్ చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. ఏ క‌థ ఓకే చేసినా.. ఈ మేలో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close