రెండు తెలుగు రాష్ట్రాలూ సింగపూర్ మాయలో ఉన్నాయన్న మేధావులు

హైదరాబాద్: థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి అధికారంలోకి రావటానికి కారణమేమిటని తెలంగాణ రైతు జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. ఈ రెండు విషయాలలో అధికారంలోకి రాకముందు షాన్ చూపించి, అధికారంలోకి వచ్చాక పరేషనా చూపిస్తున్నారని విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో రిటైర్డ్ సైంటిస్ట్ బాబూరావ్, మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, తెలంగాణ జలసాధన సమితి నేత నైనాల గోవర్ధన్‌తో కలిసి చంద్రకుమార్ నిన్న మీడియాతో మాట్లాడారు. రామగుండం, దారమచర్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ ఉందని సూచించారు. రాష్ట్రం అవసరాల కొరకు విద్యుదుత్పత్తిని ఆరునెలల్లో పునరుత్పాదక ఇంధనాల ద్వారా చేయొచ్చని చెప్పారు. రామగుండం విద్యుత్ కేంద్రానికి సింగరేణి బొగ్గు లేదని, పర్యావరణ అనుమతిని కేంద్రం తిరస్కరించిందని, ఇప్పుడు దానికి ఛత్తీస్‌గడ్‌నుంచి బొగ్గును తీసుకువస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టేముందు వాటి పర్యవసానాలపై మేధావుల, శాస్త్రవేత్తల అభిప్రాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రభుత్వం అలా ఎందుకు చేయటంలేదని ప్రశ్నించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలపై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి నమూనాలో ప్రజల పాత్ర ఎందుకు ఉండటంలేదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలూ సింగపూర్ మాయలో ఉన్నాయని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ, ఓపెన్ కాస్టుల విషయంలో టీఆర్ఎస్ మాట తప్పిందని, ఓపెన్ కాస్టులతో ఉత్తర తెలంగాణను గత్తర చేసే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close