పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ బయటికి వచ్చింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని అలరించే సాంగ్ ని ప్రజెంట్ చేశారు. పవన్ కల్యాణ్ మ్యానరిజం, ఆయన క్రేజ్‌ను తగ్గట్టుగా సాంగ్ ని చిత్రీకరించి తీరు ఆకట్టుకుంది.
దేవిశ్రీ ప్రసాద్, ఎస్పీ అభిషేక్ హై వోకల్స్ ఆలపించారు. కోరస్ సెక్షన్ కూడా పవర్ ఫుల్ గా వుంది. సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. అంటూ మొదలైన సాంగ్ అడుగడుగునా పవన్ పవర్ కి అద్దం పట్టింది.
మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే
జుట్టు ఎగురుతుంటే ఇక దడ దడ పిడుగులు పడినట్టే
చిరునవ్వుతో చించేస్తాడు
కనుసైగతో కాల్చేస్తాడు
చిటికలతో చెడుగుడు చెడుగుడు ఆడే రకం
ఏటికి ఎదురు ఈదడమంటే ఎవ్రీడే ముందు ఉంటాడు
ఎవరెస్టును మించిన ధనమును వెంట్రుకల విసిరే గుణం
మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు
బండరాలను బద్దలు కొట్టిన మొండి మొక్కవే నువ్వు
ఎందరో నిన్ను ప్రేమిస్తారు
కొందరు నిన్ను ద్వేషిస్తారు
ఏ తరమైన నీ తరమే.. మా గుండెల్లో సుస్థిరమే..
ఇలా పవన్ స్టార్ట్ డమ్, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్ అల్లారు చంద్రబోస్. మొత్తనికి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎనర్జీని ఇచ్చింది.
