తెర‌పైకి ఉద‌య‌కిర‌ణ్ బ‌యోపిక్‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య తో ఒక్క‌సారిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఉద‌య్ కిర‌ణ్ గుర్తొచ్చాడ ఇద్ద‌రి నేప‌థ్యాలు వేరైనా… ఇంచుమించు ఒకేలా కెరీర్ మొద‌లెట్టి, ఒకేలా త‌నువు చాలించారు. ఉద‌య్ – సుశాంత్ జీవితాల్ని ఒక్క‌సారిగా పోల్చుకుని చూసుకుని.. మ‌రింత‌గా ఉద‌య్ కిర‌ణ్ జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోయారు. ఓవైపు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ బ‌యోపిక్ గురించి చ‌ర్చ మొద‌లైతే – టాలీవుడ్ లోనూ ఉద‌య్ కిర‌ణ్‌పై సినిమా తీయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి.

ఇది వ‌ర‌కే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ వ‌స్తుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. దానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెప్పుకున్నారు. అయితే తేజ ఆ వార్త‌ల్ని ఖండించారు. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు ఈ బాధ్య‌త‌ని భుజాన వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ద‌ర్శ‌కుడికీ- ఉద‌య్‌కి మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలొస్తే.. అందులో ఒకటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌. అందుకే ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు ఉద‌య్ కిర‌ణ్ స్క్రిప్టు ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడ‌ని తెలుస్తోంది. అన్న‌ట్టు… ఈ రోజు ఉద‌య్ కిర‌ణ్ జ‌యంతి. త్వ‌ర‌లోనే ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ కి సంబంధించి అధికారికంగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close