వైసీపీకి చిక్కులు తెచ్చి పెడుతున్న ఉండవల్లి శ్రీదేవి ..!

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీలో రోజు రోజుకు వివాదాస్పదం అవుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నేతలు తరచూ గళమెత్తడమే కాదు.. నేరుగా జగన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. రవి అనే … గ్రామస్థాయి నేత.. తనకు ఎమ్మెల్యే శ్రీదేవి రూ. కోటి ఎగ్గొట్టారని.. ఎన్నికల ఖర్చుల కోసం అప్పులు చేసి ఇస్తే.. ఇప్పుడు పదవి ఇప్పిస్తా.. తీసుకుని కామ్‌గా ఉండమని హెచ్చరిస్తున్నారంటూ… వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. జగన్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. తాజాగా ఆమె ఓ సీఐను అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీనిపై పోలీసు వర్గాల్లోనే చర్చ ప్రారంభమయింది. శ్రీదేవి వ్యవహారశైలి మొదటి నుంచి వైసీపీలో ఇబ్బందికరంగానే ఉందనే చర్చ నడుస్తోంది.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ నందిగం సురేష్‌తో ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయి. ఇసుక తరలింపు విషయంలో… ఇద్దరు ఎవరి ఆధిపత్యానికి వారు ప్రయత్నించడంతో వివాదం హైకమాండ్ వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ పరిష్కరించుకున్నారు కానీ.. విబేధాలు మాత్రం సమసిపోలేదు. ఇద్దరూ ఇప్పటికి మాట్లాడుకోరని చెబుతూంటారు. ఆ తర్వాత చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోనూ ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయి. మంత్రి పదవి రేసులో ఇద్దరూ ఉన్నారని ప్రచారం జరగడంతో శ్రీదేవి ఆమెతో దూరంగా ఉంటున్నారని చెప్పుకున్నారు.

పార్టీ క్యాడర్‌తో సరిగ్గా ఉండకపోవడం… కులాల పేరుతో ప్రతీసారి అవసరం లేకపోయినా రాజకీయాలు చేస్తూండటం.. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూండటంతో.. వైసీపీ సానుభూతిపరులు కూడా అసంతృప్తితో ఉంటున్నారు. ఆమె కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పకొట్టాలని.. తన నియోజవర్గంలోని అన్ని మండలాల నేతలను కోరినా… ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. దీంతో.. ఉండవల్లి శ్రీదేవి వ్యవహారశైలి వైసీపీ హైకమాండ్‌కు సైతం ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close