చంద్రబాబు సర్కారుకి ఆ హామీ గుర్తొంచిందొహో..!

ఎన్నిక‌ల స‌మ‌యంలో గెలుపు ఒక్క‌టే ల‌క్ష్యం. ఏం చెప్పైనా స‌రే, ప్ర‌జ‌ల‌తో ఓట్లు వేయించుకోవ‌డం ఒక్క‌టే గ‌మ్యం! దీంతో నాయ‌కులు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తారు. మేం అధికారంలోకి వ‌స్తే అది చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అంటూ వ‌రుస వాగ్దానాలు చేస్తారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక‌… అప్ప‌ట్లో అనుకున్నాంగానీ, ప్రాక్టికాలిటీస్ ఆర్ డిఫ‌రెంట్ అంటూ కొత్త విశ్లేష‌ణ‌లు మొద‌లెడ‌తారు! గ‌తంలో నిరుద్యోగుల విష‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ఇలాంటిదే…! బాబు వ‌స్తే జాబు గ్యారంటీ అన్నారు. దాని అమ‌లు ఏ స్థాయిలో ఉందో ఓపెన్ సీక్రెట్‌. నిరుద్యోగుల‌కు ప్ర‌తీనెలా భృతి ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ హామీ గురించి గ‌డ‌చిన రెండున్న‌రేళ్ల పైబ‌డిన పాల‌న‌లో ఏనాడూ స్పందించింది లేదు. అయితే, ఇన్నాళ్ల‌కు నిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశంలో చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యించ‌డం విశేషం!

గ‌తంలో నిరుద్యోగ భృతి అమ‌లుపై ర‌క‌ర‌కాల అధ్య‌య‌నాలు చేస్తున్నామ‌న్నారు. భృతి ఇస్తున్న రాష్ట్రాలను చూస్తున్నామ‌నీ, కొన్ని టెర్మ్స్ అండ్ కండిషన్స్ త‌యారు చేసే క్ర‌మంలో ప్ర‌భుత్వం ఉంద‌నీ గ‌తంలో మంత్రి అచ్చెన్నాయుడు ఏదో కొత్త కార‌ణం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ హామీని శాశ్వ‌తంగా అట‌కెక్కించే ప్ర‌య‌త్నంలో తెలుగుదేశం ఉంద‌ని అప్పుడే కొన్ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. మ‌రి, ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు మాత్ర‌మే ఇది తెర‌మీదికి ఎందుకొస్తుందీ అంటే… ప్ర‌జా వ్య‌తిరేక సెగ‌ నెమ్మ‌దిగా టీడీపీకి త‌గులుతోంద‌ని చెప్పుకోవాలి.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు ఏదో చేశామని చెప్పుకున్నారు. మ‌హిళ‌ల‌కు కూడా చాలా ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నామ‌నీ చాటుకున్నారు. కానీ, యువ‌త‌కు ఏం చేసిందీ స‌ర్కారు అని నిల‌దీస్తే.. వారి ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. బాబు వ‌స్తే జాబు అన్నారు. ఆయ‌న వ‌చ్చారు… కానీ, జాబులు రాలేదు అనే అభిప్రాయం యువ‌త‌లో బ‌లంగా ప‌డుతోంది. కాబ‌ట్టి, యువ‌త‌లో తెలుగుదేశం ప‌ట్ల నెగెటివిటీ పెర‌గ‌కుండా ఉండాలంటే ఏదో ఒక‌టి చేయాలి. అందుకే, ఆ నిరుద్యోగ భృతి ఇప్పుడే ప్ర‌క‌టించేస్తే పార్టీకి కాస్తైనా ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది క‌దా!

ఇక్క‌డో చిన్న ట్విస్ట్ కూడా ఉందండోయ్‌! నిరుద్యోగ భృతి తీసుకున్న‌వారితో సామాజిక కార్య‌క్ర‌మాల‌కు చేయించుకునే ప్ర‌పోజ‌ల్ కూడా ఉంద‌ట‌! భృతి పొందేవారి సేవ‌ల్ని వినియోగించుకునే విధంగా ప‌థ‌కాన్ని త‌యారు చేయాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు నిర్ణ‌యించిందిట‌! సామాజిక కార్య‌క్ర‌మాలు అంటే ఏ త‌ర‌హాలో ఉంటాయో చూడాలి మ‌రి! అయితే… భృతి ప్ర‌క‌టించినంత మాత్రాన యూత్ ఖుషీ అయిపోతార‌ని భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్టే..! ఉద్యోగాలేవీ..? నోటిఫికేన్లేవీ..? రాష్ట్రానికి వ‌స్తున్నాయ‌న్న‌ సంస్థ‌లేవీ…? అవి క‌ల్పిస్తున్న ఉపాధి అవ‌కాశాలేవీ..? ఓవ‌రాల్‌.. నిరుద్యోగ భృతి ఒక కంటి తుడుపు చ‌ర్య‌గా మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానిస్తున్న‌వారూ ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close