కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

సీబీఐని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మాస్టర్స్ డిగ్రీ ఇవ్వవచ్చంటారు చాలా మంది పరిశీలకులు. బీజేపీ సహా అనేక రాజకీయ పార్టీలు ఈ విషయంలో కాంగ్రెస్ పై అనేక సార్లు ఆరోపణ చేశాయి. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసులో కాంగ్రెస్ వైఖరి మరోసారి బయటపడింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్, మరో నలుగురు లష్కరే తయిబా ఉగ్రవాదులు ఎన్ కౌంటర్లో మరణించారు.

ఇష్రత్ ఉగ్రవాది కాదని ఆమె కుటుంబ సభ్యులు వాదించారు. అది బూటకపు ఎన్ కౌంటర్ అని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ కేసులో సీబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందనడానికి తాజాగా మరో ఆధారం లభించింది. అప్పటి హోం సెక్రటరీ జీకే పిళ్లై ఆనాటి వాస్తవాన్ని వెల్లడించారు. గుజరాత్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను సీబీఐ మార్చడానికి కారణం రాజకీయ నిర్ణయమని ఆయన బయటపెట్టారు. రాజకీయ స్థాయిలోనే అది జరిగిందని ఆయన వెల్లడించారు.

ఇది కాంగ్రెస్ కు షాకిచ్చే విషయం. ఇంత కాలం నరేంద్ర మోడీని, బీజేపీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుయ్యబట్టింది. బూటకపు ఎన్ కౌంటర్ చేయించారని ఆరోపించింది. ఇప్పుడు పిళ్లై వెల్లడించిన వాస్తవంతో బీజేపీకి కొత్త అస్త్రం దొరికింది. దీనిపై కాంగ్రెస్ వైఖరిఏమిటో చెప్పాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే స్పందించారు. లోక్ సభలో బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.

నిజానికి, ఈ ఎన్ కౌంటర్ ను సాకుగా చూపి అనేక విపక్షాలు మోడీపై భయంకరంగా రాజకీయ దాడి చేశాయి. అయినా ఆయన మౌనంగా తన పనితాను చేసుకుపోయారు. ఇష్రత్, మరో నలుగురు అమాయకులు కాదని అనేక సార్లు రుజువైంది. సాక్షాత్తూ ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరోనే గుజరాత్ పోలీసులకు ఇష్రత్ సమాచారం ఇచ్చింది. నరేంద్ర మోడీని హత్య చేయడానికి ఇష్రత్ సహా నలుగురు ముంబై నుంచి అహ్మదాబాద్ వచ్చారనేది ఆ సమాచారం సారాంశం. దీనిపై గుజరాత్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగింది.

లష్కరే ముష్కరులు లాహోర్ లో ముద్రించే తమ పత్రికలోనూ ఇష్రత్ ధీర యువతి అని పొగిడారు. ఆమె అమర యోధురాలంటూ నివాళులు అర్పించారు. ఫొటోతో సహా ఇష్రత్ గురించి పెద్ద వ్యాసమే రాశారు. పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్డీ సైతం ఇష్రత్ లష్కరే ఆత్మాహుతి సభ్యురాలనే విషయాన్ని కోర్టుకు తెలిపాడు. ఆమె మానవబాంబు అని వివరించాడు. ఇన్ని ఆధారాలున్నా మోడీని ఇరుకున పెట్టడం ఒక్కటే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయానికి పాల్పడిందని బీజేపీ చేస్తున్న వాదన నిజమేనంటూ తాజా వివరాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో, తన నిర్దోషిత్వాన్ని ఎలా రుజువు చేసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close