ప‌వ‌న్‌తో అన్ స్టాప‌బుల్‌: పొలిటిక‌ల్ ప్ర‌శ్న‌లే ఎక్కువ‌..?

ప‌వ‌న్ ది రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం. ఆయ‌న‌లో హీరో ఉన్నాడు.. రాజ‌కీయ నాయ‌కుడూ ఉన్నాడు. ప‌వ‌న్ నుంచి ఈ రెండు ర‌కాల ప్రశ్న‌ల‌కూ స‌మాధానాలు రాబ‌ట్టొచ్చు. బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఇంట‌ర్వ్యూలో కూడా అదే ఆశిస్తారు ఫ్యాన్స్‌. అన్ స్టాప‌బుల్ లో ప‌వ‌న్ ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. ఫిబ్ర‌వ‌రిలో… ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు టీజ‌ర్ వ‌దిలారు. ఇందులో పొలిటిక‌ల్ ప్ర‌శ్న‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అంద‌రి హీరోల్నీ ”న‌న్ను బాలా అని పిల‌వండి” అని బాల‌య్య అడ‌గ‌డం మామూలే. ఈసారి కూడా ప‌వ‌న్‌ని అలానే అడిగాడు. ”నేను ఓడిపోవ‌డానికి సిద్ధం కానీ.. మిమ్మ‌ల్ని మాత్రం అలా పిల‌వ‌లేను” అని ప‌వ‌న్ న‌వ్వేస్తే… ”ఈ పాలిటిక్సే వ‌ద్దు” అంటూ బాల‌య్య సుతిమెత్త‌గా కౌంట‌ర్ వేశాడు.

ఈమ‌ధ్య నీ విమ‌ర్శ‌ల్లో వాడీ వేడీ డ‌బుల్ ఇంపాక్ట్ లో క‌నిపిస్తోంది.. అని బాల‌య్య అంటే.. ”చాలా ప‌ద్ధ‌తిగానే మాట్లాడుతున్నానండీ..” అంటూ ప‌వ‌న్ స‌ర‌దాగా స‌మాధానం చెప్ప‌డం ఆక‌ట్టుకొంటోంది.

”చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాల‌నుకొన్న‌వీ.. వ‌ద్ద‌నుకొన్న‌వీ.. ఏమిటి” అని బాల‌య్య అడిగినప్పుడు ప‌వ‌న్ ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌మాధానం ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే సంద‌ర్బంలో వ‌దిన‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ప‌వ‌న్ గుర్తు చేసుకొన్న విధానాన్ని ఈ టీజ‌ర్‌లో హైలెట్ చేశారు. అభిమానాన్ని ఓట్లుగా మ‌ల‌చుకోవ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యార‌న్న ప్రశ్న సంధించాడు బాల‌య్య‌. మ‌రి దానికి ప‌వ‌న్ ఎలాంటి స‌మాధానం ఇచ్చాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ బ‌య‌ట‌కు రావాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close