బీజేపీకి యూపీ “బీపీ”..!

భారతీయ జనతా పార్టీకి యూపీ బీపీ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ సీట్లు సంపాదిస్తేనే.. ఢిల్లీలో అధికారం దక్కుతుంది. గత ఎన్నికల్లో బీజేపీ యూపీలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. 80 పార్లమెంట్ సీట్లలో 71 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో విజయం సాధించింది. అయితే బీజేపీని అడ్డుకోవడానికి బద్ద శత్రువులైన… ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్‌లకు తోడు కాంగ్రెస్, ఆర్‌ఎల్డీ కూడా జట్టుగా మారాయి. కులసమీకరణాలే… గెలుపోటములు తేల్చే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓటు బ్యాంక్ అగ్రకులాలకే పరిమితమయింది. గత లోక్ సభ ఎన్నిక్లలో నరేంద్రమోదీ హవా .. ఓ రేంజ్ లో ఉన్నందున… 42 శాతం ఓట్లు వచ్చాయి. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఈ మూడింటికి కలిసి 54 శాతం ఓట్లు వచ్చాయి.విపక్షాల అనైక్యత కలసి వస్తూండటంతో బీజేపీ అనూహ్య విజయాలు నమోదు చేస్తూ వెళ్లింది.

యూపీలో మైనారీటీలు, దళితులపై దాడులు పెరగడం, యోగి ప్రభుత్వ పాలనపై ఏడాదికే తీవ్ర వ్యతిరేకత రావడంతో.. బీజేపీకి చెక్ పెట్టాడానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని నిర్ణయించాయి. సుదర్ఘ కాలం బద్ద విరుధోలుగా ఉన్నా.. బీజేపీకి చెక్ పెట్టకపోతే తమ ఉనికికే ప్రమాదమన్న భావనతో… బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ చేతులు కలిపాయి. ఆ ఫలితం వెంటనే కనిపించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య పుల్ఫూర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి. కలసి కట్టుగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ కూటమి ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంది. దేశంలో ఓ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండగా తమ నియోజకవర్గాలు పోగొట్టుకున్న చరిత్ర లేదు. అదే ఫలితం కైరానాలోనూ రిపీట్ అయింది. ఇవన్నీ బిజెపీ సిట్టింగ్ స్థానాలు. అన్నింటిలోనూ బీజేపీ ఘోరంగా పరాజయం పాలైంది. నూర్ పూర్ అనే సిట్టింగ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది . అక్కడ సమాజ్ వాదీ పార్టీ గెలుపొందింది.

విపక్షాలన్నీ ఏకమవడం తమకు సవాలేనని… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా చెబుతున్నారు. ఏకమైన ఏ పార్టీ కూడా… బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి లేదు.అందుకే ఓట్లలో చీలిక తీసుకురాకపోతే.. పెను ప్రమాదం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ దేశమొత్తం మీద 282 సీట్లను గెలుచుకుంది. అందులో యూపీలో గెలిచినవే 71. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో కూడా ఒక్కటీ వదలకుండా క్లీన్ స్వీప్ చేసేశారు. ఇప్పుడు మాత్రం మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకపోతే.. యూపీలో బీజేపీ సింగిల్ డిజిట్ కు పడిపోయినా ఆశ్చర్యం లేదనేది రాజకీయవర్గాల అంచనా. పరిస్థితిలో మార్పు కోసం ఓబీసీ కోటాలో వర్గీకరణ పేరుతో కొత్త రాజకీయాన్ని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన రాజకీయం.. త్వరలో యూపీని వేడెక్కించే అవకాశాలున్నాయి. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close