ప్రకాష్ రాజ్ సినిమా : అర‌వై ఏళ్లు – ఛామ‌న ఛాయ‌

ఉల‌వ‌చారు బిరియానీ, మ‌న ఊరి రామాయ‌ణం.. ఇలా అచ్చమైన తెలుగు పేర్లతో సినిమాలు తీస్తున్న న‌ట ద‌ర్శకుడు ప్రకాష్ రాజ్‌. మ‌న ఊరి రామాయ‌ణం ఈ ద‌స‌రాకి ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈలోగా ఆయ‌న మ‌రో సినిమాకి రంగం సిద్దం చేస్తున్నారు. ఈసారీ వెరైటీ టైటిల్‌నే ఎంచుకొన్నారు. పేరేంటో తెలుసా… ‘అర‌వై ఏళ్లు – ఛామ‌న ఛాయ‌’. ఆల్జీమ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే ఓ వృథ్దుడి క‌థ ఇది. తెలుగు, తమిళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందనుంది. ప్రస్తుతం స్ర్కిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. అర‌వై ఏళ్ల వృద్దుడి పాత్రలో ఎవరు క‌నిపిస్తార‌న్నది ఇంకా నిర్ణయించ‌లేద‌ట‌. స్క్రిప్టు ప‌క్కాగా పూర్తయ్యేకే న‌టీన‌టుల్ని నిర్ణయిస్తార‌ని తెలుస్తోంది. 2017 ప్రారంభంలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికీ ఇళ‌య‌రాజానే స్వరాలు స‌మ‌కూరుస్తార‌ని స‌మాచారం.

న‌టుడిగా సంతృప్తిక‌ర‌మైన ప్రయాణం సాగిస్తున్న స‌మ‌యంలోనే ద‌ర్శకుడిగా అడుగుపెట్టాడు ప్రకాష్ రాజ్. ధోని బాగానే ఉంద‌నిపించింది. ఉల‌వ‌చారు లెక్క త‌ప్పింది. మ‌రి మ‌న ఊరి రామాయాణం ఎలా ఉంటుందో? ద‌ర్శకుడిగా త‌న జ‌యాప‌జ‌యాల గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ”క‌ష్టప‌డి ప‌నిచేయ‌డం ఒక్కటే ఎవ‌రి చేతుల్లో అయినా ఉంటుంది. నేనూ అదే చేశా. నా సినిమాలు జ‌నానికి రీచ్ అవ్వక‌పోవ‌డానికి కుంటు సాకులు చెప్పద‌ల‌చుకోలేదు. ద‌ర్శకుడిగా ఇదంతా నేర్చుకొనే ప్రయ‌త్నంలో భాగ‌మే” అంటున్నారాయ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close