పాట‌లు ముందే చూపించేస్తున్నారు.. ఇదేం ధైర్య‌మో..?

సినిమాకి సంబంధించిన చిన్న వీడియో బిట్ రిలీజ్ చేయాల‌న్నా చాలా ర‌కాలుగా ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాత‌లు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ మిన‌హాయిస్తే… విడుద‌ల‌కు ముందు పెద్ద‌గా ఫుటేజీని బ‌య‌ట‌కు వ‌ద‌ల‌రు. సింగిల్స్‌గా పాట‌లు విడుద‌ల చేస్తున్నప్పుడు ఆ పాట‌కు సంబంధించిన మేకింగ్ నో, ఆ పాట ఫొటోల‌నో, సాహిత్యాన్నో ఓ వీడియోగా మ‌ల‌ని విడుద‌ల చేస్తారు. అల వైకుంఠ‌పుర‌ములో విష‌యంలో చిత్ర‌బృందం కాస్త భిన్నంగా ఆలోచించింది. ఆ పాట‌కు ప‌నిచేసిన గీత‌కారుల్ని, సంగీత కారుల్నీ తెర‌పైకి తీసుకొచ్చి ఓ వీడియోని రూపొందించారు. అవి బాగా క్లిక్ అయ్యాయి. ఇప్పుడొస్తున్న కొత్త సినిమాలు కొన్ని అదే స్టైల్ ఫాలో అవ్వ‌డానికి చూస్తున్నాయి.

ఉప్పెన పాట‌లు రెండు ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. సుకుమార్ శిష్యుడు చిత్ర‌మిది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్న ఈ సినిమాపై జ‌నం ఫోక‌స్ పెట్ట‌డం స‌హ‌జ‌మే. లిరిక‌ల్ వీడియోల స్థానంలో ఈ సినిమాకి సంబంధించిన విజువ‌ల్ వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. రెండు పాట‌ల వీడియోలూ బ‌య‌ట‌కు వ‌దిలేసింది చిత్ర‌బృందం. రాబోయే పాట‌ల విష‌యంలోనూ ఇదే పంథా అనుస‌రించ‌బోతోంద‌ని టాక్‌. పాట‌లు ముందే చూపించేడ‌యం వ‌ల్ల‌.. ఈ సినిమా జోన‌ర్, క‌ల‌ర్‌, కాస్ట్యూమ్స్ ఇలా.. అన్నీ రివీల్ అయిపోతున్నాయి. ఓర‌కంగా ప్రేక్ష‌కుల్ని సినిమా మూడ్‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం ఇది. పాట‌లు ఎలాగూ బాగున్నాయి కాబ‌ట్టి.. యూ ట్యూబుల్లో ప‌దే ప‌దే చూసుకునే అవ‌కాశం ఉంటుంది. అలా కావ‌ల్సినంత పబ్లిసిటీ.

విడుద‌ల‌కు ముందే పాట‌లు ఇన్ని సార్లు చూసేసిన త‌ర‌వాత‌… మ‌ళ్లీ కొత్త‌గా థియేట‌ర్లో చూస్తున్న‌ప్పుడు ఆ కిక్ ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌నే అనుమానాలు రావొచ్చు. కాక‌పోతే.. ప‌బ్లిసిటీలో ఇదో ర‌క‌మైన ప్ర‌క్రియ‌. ప్రేక్ష‌కుడు సినిమా గురించి ఏదేదో ఊహించుకోకుండా రాకుండా.. అడ్డు క‌ట్ట వేసే మంత్రం. ఉప్పెన విష‌యానికొస్తే.. ఈ రెండు పాట‌ల్లోనూ హీరోయిన్ కృతి శెట్టి చాలా అందంగా క‌నిపించింది. త‌న లుక్స్‌తో యువ‌త‌రానికి గాలం వేసింది. ఆమె కోసమైనా యువ‌త‌రం థియేట‌ర్ల‌కు వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌. సో.. ఉప్పెన చిత్ర‌బృందం టార్గెట్ కూడా అదే కావొచ్చు. అందుకే పాట‌ల‌తో ఎర వేస్తున్నారిలా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close