ప్రపంచ శాంతి కోసమే ఆయుధాలు..యుద్దాలు?

అమెరికా ప్రపంచ శాంతిని కోరుకొంటుంది. అదే సమయంలో ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అమ్ముతుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అది యుద్దాల ద్వారానే సాధ్యమని దాని నిశ్చితాభిప్రాయం. అందుకే పాకిస్తాన్ కి అత్యాధునికమైన ఎఫ్-16 యుద్ద విమానాలు అమ్ముతుంది. భారత్ కి 145ఎమ్-777 ఫిరంగులు అమ్ముతుంది.

భారత్ తో మరో యుద్ధం చేసి తమ సత్తా చాటుకోవాలని పాక్ ఆర్మీ అధికారులు చాలా కాలంగా తెగ ఉబలాటపడుతున్నారు. ఇప్పుడు వారి చేతిలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి కనుక ఓసారి వాటిని భారత్ పై ప్రయోగించి చూసుకోవాలని అనుకొంటున్నారు. వారికి ఇప్పుడు అత్యాదునికమయిన ఎఫ్-16 యుద్ద విమానాలు కూడా అమెరికా సమకూర్చిపెట్టింది. కేవలం పాకిస్తాన్ కే అన్ని ఆయుధాలు సమకూర్చుతూ ఉంటే భారత్ మళ్ళీ రష్యాకి దగ్గరవవచ్చుననే భయం కూడా ఉంది. కనుక భారత్ కోరినట్లుగా అత్యాధునిక 145ఎమ్-777 ఫిరంగులను సరఫరా చేయడానికి అంగీకరించింది. దాని కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖకు అంగీకార పత్రం కూడా అందజేసింది.

ఈ ఆయుధాల అమ్మకం ద్వారా అమెరికా $700 మిలియన్లు సంపాదించుకొంది. పాకిస్తాన్ నుంచి కూడా ఇంచుమించు అంతే మొత్తం సంపాదించుకొంటోంది.  కాపిటలిస్ట్ దేశమయిన అమెరికా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించుకోవాలనుకొంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదు కానీ ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే సాకుతో ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అమ్ముకొంటూ వాటిని వినాశనంవైపు నడిపిస్తూ  డబ్బు సంపాదించుకోవాలని అమెరికా తాపత్రయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.

పఠాన్ కోట్ దాడి తరువాత భారత్-పాక్ మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతలు గురించి అమెరికాకి బాగా తెలిసి ఉన్నప్పటికీ రెండు దేశాలని శాంతి చర్చలకు ప్రోత్సహించే ప్రయత్నం చేయకుండా రెంటికీ అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసి డబ్బు సంపాదించుకొంటోంది. ఒకవేళ అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే భారత్, పాక్ దేశాలు మరో దేశం నుండయినా కొనుగోలు చేసుకొంటాయి కనుక అదేదో తనే అమ్ముకొంటే మంచిదని అమెరికా భావిస్తోందేమో?

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close