రాజయ్య ఎఫెక్ట్ కాంగ్రెస్ పై ఉంటుంది తూచ్…ఉండదు

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్ధి పేరు ఖరారు చేయక ముందే తాము కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ప్రకటించుకొన్నారు. కానీ మొన్న కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు, ముగ్గురు మనుమలు సజీవ దహనం అవడం, ఆ తరువాత రాజయ్య, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ కారణంగా రాజయ్య స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా సర్వే సత్యానారాయణను బరిలో దింపడం వంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయి. వాటి ప్రభావం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పై పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిగిన సంఘటనలను చూసి భావోద్వేగానికి లోనయినందునో లేక పొరపాటున నోరు జారో చేసిన ఆ చిన్న వ్యాఖ్య నూటికి నూరు శాతం వాస్తవమే. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలబడిన రాజయ్య హత్యారోపణలు ఎదుర్కొని అరెస్ట్ కావడం ఎన్నికలలో కాంగ్రెస్ పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు చిన్నారి పిల్లలు అత్యంత దారుణంగా సజీవ దహనం కావడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు చాలా చలించిపోయారు. వారందరూ తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. రాజయ్యపై తమ కోపాన్ని ఆయన స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సర్వే సత్యానారాయణపై చూపించే అవకాశం ఉంది. అదే విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ ఆ విధంగా చెప్పడం వలన అటువంటి ఆలోచన లేని వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా రాజయ్య కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఆలోచన కల్పించుతునట్లుంది.

ఈ విషయం గ్రహించిన సీనియర్ కాంగ్రెస్ నేత కె జానారెడ్డి నష్ట నివారణ చర్య చెప్పట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాజయ్య ఇంట్లో జరిగిన ప్రమాదం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తోంది. అందుకు కాంగ్రెస్ పార్టీ చాలా విచారిస్తోంది. కానీ ఆ కారణంగా మేము ఉప ఎన్నికలలో పోటీ నుండి వెనక్కి తగ్గలేము కనుక ఆయనకు బదులు సర్వే సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనుక ఇక దాని గురించి ఈ సమయంలో మాట్లాడకూడదు. ఆ సంఘటనతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు కనుక దాని ప్రభావం మా పార్టీపై ఉండబోదు. ఈ ఎన్నికలలో మా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అందుకోసం జిల్లాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కృషి చేస్తాము,” అని అన్నారు.

జానారెడ్డి చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కనుకనే అంత చక్కగా సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర దుర్ఘటన ప్రభావం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ తప్పించుకోవడం కష్టమే. అందుకోసం జానారెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు, శ్రేణులు చాలా గట్టిగా కృషి చేసి ప్రజల దృష్టిని, ఆలోచనలను ఆ సంఘటనపై నుంచి మళ్ళీ రైతుల ఆత్మహత్యలు తదితర సీరియస్ అంశాల మీదకు మళ్ళించ గలిగితేనే సర్వే సత్యనారాయణ విజయావకాశాలు మెరుగవుతాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడంలో కాంగ్రెస్ నేతలది అందె వేసిన చెయ్యి. కనుక వారు తప్పకుండా అటువంటి ప్రయత్నాలేవో చేయక మానరు. అయినప్పటికీ సర్వే స్థానికుడు కాకపోవడం, వరంగల్ నియోజక వర్గ సమస్యల పట్ల అవగాహన లేకపోవడం వంటి అనేక ఇతర అంశాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close