పవన్ మీద జగన్ వేసి పెట్టుకున్న స్కెచ్ అలా తలకిందులైందట!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని ఎన్నికల కోలాహలం మొదలవగానే దెబ్బ కొట్టడానికి జగన్ ముందుగానే ప్రణాళికలు వేసి పెట్టుకున్నాడట. అయితే జగన్ వేసి పెట్టుకున్న స్కెచ్ మొత్తం ఆఖరి నిమిషంలో తారుమారైందట. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, వ్యూహకర్తలు సమావేశం అయి అప్పటికప్పుడు వ్యూహం మార్చాల్సి వచ్చిందట. దాదాపు వారం రోజుల కిందట జరిగిన ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల గుసగుసల లో గట్టిగా వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

“పవన్ కళ్యాణ్ టికెట్లు అమ్ముకుంటున్నాడు” అంటూ ప్రచారం చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టుకున్న జగన్:

గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవి టికెట్లు అమ్ముకున్నాడు అన్న ప్రచారం బాగా వర్కౌట్ అయి, ఎన్నికల్లో చిరంజీవి ని బలంగా దెబ్బ తీసింది. నిజానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు అప్పట్లో పార్టీ కోసం ఫండ్ తీసుకుని టికెట్లు ఇచ్చినప్పటికీ కేవలం చిరంజీవి మీద మాత్రమే టిక్కెట్లు అమ్ముకున్నారని మీడియా సహాయంతో బలంగా ముద్ర వేసి, ప్రత్యర్థి పార్టీలు చిరంజీవిని చావుదెబ్బ తీశాయి. ఈసారి కూడా జగన్ ఇదే తరహా విధానాన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించాలని దాదాపుగా స్కెచ్ మొత్తం వేసి కూర్చున్నాడట. జనసేన పార్టీ టికెట్లు ప్రకటించడం మొదలుపెట్టగానే “పవన్ కళ్యాణ్ టికెట్లు అమ్ముకుంటున్నాడు” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించడానికి మొత్తం సరంజామా సిద్ధం చేసుకుని కూర్చున్నారట. కొంతమంది నేతలను జనసేన పార్టీ వద్ద కు వీరే పంపించారట. అయితే ప్రజారాజ్యం అనుభవం కారణంగా ఎంతో అప్రమత్తంగా ఉన్న పవన్ కళ్యాణ్, కొత్తగా ఆఖరి నిమిషంలో వస్తున్న వాళ్లను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే వారికి అపాయింట్మెంట్ ఇచ్చాడట. దీంతో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసుకున్న బడా నేతలకు కనీసం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా లభించలేదట.

ఒక్క నేత తో కూడా డబ్బులు తీసుకోలేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలను అన్న పవన్ కళ్యాణ్:

అయితే అక్కడికీ, పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్న నేతలలో ఎవరితోనైనా డబ్బు తీసుకున్నట్టుగా కూసింత సమాచారం వచ్చినా, దాని ఆధారంగా సాక్షి పత్రికలో మొదటిపేజీ బ్యానర్ స్టోరీలు రాయాలని, సాక్షి ఛానల్ లో వరుస కథనాలు ప్రసారం చేయాలని చేసుకున్న “ముందస్తు ప్రయత్నాలన్నీ” పవన్ కళ్యాణ్ ఒక్కరి తో కూడా డబ్బులు తీసుకోకుండా టికెట్లు ఇచ్చిన తీరుతో వృధా అయిపోయాయిట. ఆఖరికి ఎస్పీవై రెడ్డి లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కూడా ఒక్క రూపాయి పార్టీ ఫండ్ తీసుకోకుండా టికెట్ ఇవ్వడం తో వైఎస్ఆర్ సీపీ నేతల కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట. కూలీల పిల్లలకు కండక్టర్ల పిల్లలకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తుండడంతో ఇక “టిక్కెట్లు అమ్ముకున్నార”నే ప్రచారం ఫలితాలను ఇవ్వదని, జనం నమ్మరు అని డిసైడ్ అయిపోయి న వైఎస్ఆర్ సీపీ నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో అనుసరించాల్సిన తదుపరి ప్రణాళిక కోసం అప్పటికప్పుడు పార్టీ విలేకరులతో సమావేశమయ్యారట.

పవన్ మీద తదుపరి వ్యూహం కోసం వైకాపా సమావేశం:

టిక్కెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేయలేము కాబట్టి నెక్స్ట్ ఏ రకంగా పవన్ కళ్యాణ్ మీద ప్రచారం చేయాలనే విషయంపైన జరిగిన చర్చలో కొందరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం వంటి విషయాలను చర్చలోకి పెట్టి మహిళా ఓటర్ల ని జనసేన కు దూరం చేద్దామని ప్రపోజల్ వచ్చినప్పటికీ, అది బెడిసి కొట్టే అవకాశం కూడా ఉందని మిగతావాళ్లు చెప్పడంతో, వేరే ఏ రకమైన ఆరోపణలు చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆఖరి అస్త్రంగా, ” తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు” అనే ప్రచారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందట. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టి ఉండడంతో, గట్టిగా ప్రచారం చేస్తే ప్రజలను నమ్మించవచ్చు అని భావించి ఈ నిర్ణయానికి వచ్చారట.

ఇక నిర్ణయం జరిగిందే తడవుగా, సాక్షి పత్రిక ఛానల్ ఉపయోగించి జనసేన టీడీపీతో కుమ్మక్కైంది అంటూ ప్రచారాన్ని ముమ్మరంగా మొదలుపెట్టారు. అందులో నిజం లేకపోయినా, అందరినీ కాకపోయినా ఎంతో కొంత మంది ని సాక్షి ఛానల్ సాక్షి పత్రిక లో చేసిన ప్రచారంతో నమ్మించగలిగారు. మరి ఒక్క టికెట్ కూడా అమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నిజాయితీగా టికెట్లు ఇచ్చినప్పటికీ, టీడీపీ తో కుమ్మక్కు అంటూ సాక్షి చేసిన ప్రచారం వల్ల పవన్ కళ్యాణ్ కు దెబ్బ పడుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close