తెలంగాణ రాజకీయాల్లో “బపూన్” దుమారం..! కేటీఆర్ పై గురి..!

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం.. తెలంగాణలో రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ దుమారం ప్రధానంగా కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ… కేటీఆర్ పరుషమైన పదజాలాన్ని ప్రయోగించారు. ఇందులో ప్రధానమైనది బపూన్. సీనియర్ నేత వీహెచ్ ను పరోక్షంగా బపూన్ గా అభివర్ణిస్తూ.. కేటీఆర్.. విమర్శలు చేశారు. రెండు రోజుల కిందట… కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లారు. అక్కడికి కేటీఆర్ రావాలని..గ్లోబరీనా సంస్థకు తనకు సంబంధం లేదని… ప్రమాణం చేయాలని హంగామా చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేటీఆర్.. ఓ బపూన్.. తనను పెద్దమ్మగుడికి వచ్చి ప్రమాణం చేయమని డిమాండ్ చేస్తే… వెళ్లి ప్రమాణం చేయాలా.. అని ప్రశ్నించారు. ఈ పదప్రయోగంపై… కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు.

వీహెచ్ అయితే.. శివాలెత్తిపోయారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు..కేటీఆర్ పుట్టలేదని… అలాంటి కేటీఆర్‌ బఫూన్‌ అంటున్నారు… మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్‌ బావమరిది స్నేహితుడికి గ్లోబరీనా టెండర్‌ ఇచ్చారని.. బావమరిది మీద మోజుతో 22మంది విద్యార్థులను బలిగొన్నారని మరోసారిఆరోపించారు. తాను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుందని వీహెచ్చ హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడులు చేయాలని కూడా వీహెచ్ పిలుపునిచ్చారు. వీహెచ్ కు మద్దతుగా.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల సమస్యలపై వీహెచ్‌ పోరాడుతుంటే.. కుర్రకుంక ఆయన్ని బఫూన్‌ అంటున్నాడని విమర్శించారు. తెలంగాణలో ఎంత బలుపు పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవాలని రేవంత్ ప్రజలను కోరారు. బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు.

వీహెచ్ గురించి.. కేటీఆర్ తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని రేవంత్ సూచించారు. ఎంసెట్ లీకేజీ కేసులో కేటీఆర్‌ ఫ్రెండ్‌ మామ సంస్థ అయిన మాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌పై.. ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ బపూన్ వ్యాఖ్యలపై.. తెలంగాణలో రాజకీయ కలకలం కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close