ఫ్రీగానే చూళ్లేదు.. డ‌బ్బులు పెట్టి చూస్తారా?

అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా థియేట‌ర్ల తాళాలు తెర‌చుకుంటున్నాయి. మెల్ల‌మెల్ల‌గా సినిమాలూ వ‌చ్చేస్తున్నాయి. అయితే.. ముందు పాత సినిమాల్ని వేసి ఓ ట్రైల్ వేద్దామ‌నుకుంటున్నారు నిర్మాత‌లు. పాత‌వి అంటే మ‌రీ పాత‌వి కాదు. ఓటీటీలో వ‌చ్చి, థియేట‌ర్ల‌లో రాని సినిమాల్ని విడుద‌ల చేసే యోచ‌న‌లో ఉన్నారు. ఓటీటీలో విడుద‌లైన `వి`, `ఒరేయ్ బుజ్జిగా` లాంటి సినిమాలు ఇప్పుడు థియేట‌ర్ల‌లోనూ రానున్నాయి. `వి` ఈనెల 18న `ఒరేయ్ బుజ్జిగా` జ‌న‌వ‌రి 1న విడుద‌ల కానున్నాయి.

అయితే ఇవి రెండూ ఓటీటీలో ఉన్నాయి. విడుద‌లై కూడా చాలా రోజులైంది. పైగా ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకున్న సినిమాలు. ఇప్ప‌టికీ ఓటీటీలో ఫ్రీగానే చూడొచ్చు. సినీ గోయ‌ర్స్ విడుద‌లైన రోజే ఈ సినిమాని ఓటీటీలో చూసేశారు. బీసీ సెంట‌ర్ల‌లో, మ‌రీ ముఖ్యంగా ఓటీటీ వేదిక‌లంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేని చోట‌.. నాని సినిమా అంటే కాస్తో కూస్తో బ‌జ్ ఉండొచ్చు. కాక‌పోతే.. ‘ఆ సినిమా ఫ్లాప‌ట్రా..’ అనే విష‌యం వాళ్ల‌కెప్పుడో తెలిసిపోయి ఉంటుంది. అలాంటి సినిమాల్ని.. ఇప్పుడు డ‌బ్బులిచ్చి చూస్తారా, అందులోనూ.. క‌రోనా భ‌యాల మ‌ధ్య‌?  పాత సినిమాల్ని ఇప్పుడు ఎన్ని వేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అస‌లు సినిమాలు చూసే ఆస‌క్తి జ‌నాల‌కు ఉందా?  లేదా?  అనేది తెలియాలంటే.. కొత్త సినిమాని వ‌ద‌లాల్సిందే. అయితే ఆ రిస్క్ మాత్రం ఎవ్వ‌రూ చేయ‌డం లేదు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close