వంశీ పైడిప‌ల్లి ఇప్పుడేం చేస్తాడు?

ఊపిరి సినిమాకు రూ.21 కోట్లు న‌ష్టం వ‌చ్చింది.. దానికి స‌మాధానం చెప్పాలి అంటూ వంశీపైడిప‌ల్లిని లాక్ చేశాడు పీవీపీ ప్ర‌సాద్‌. అంతేనా…??? మ‌హేష్‌తో వంశీ చేయ‌బోయే క‌థ‌పై నాకూ హ‌క్కులున్నాయి అంటూ ఆ సినిమా మొద‌ల‌వ్వ‌కుండా స్టే ఆర్డ‌రు తెచ్చుకొన్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వంశీ ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. త‌న వాద‌న వినిపించుకోలేదు. టాలీవుడ్‌లో ఓ ద‌ర్శ‌కుడికి ఇలాంటి ప‌రిస్థితి ఎదురుకావ‌డం ఇదే తొలిసారి. అందుకే వంశీపైడిప‌ల్లి ఆచి తూచి స్పందించాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది.

వంశీ ముందున్న మార్గాలు రెండే. ఒక‌టి…. పీవీపీతో రాజీ కుదుర్చుకోవ‌డం. రెండోది మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాలో పీవీపీని పార్ట‌న‌ర్‌గా చేర్చుకోవ‌డం. రెండోది ఎలాగూ కుదిరే ప‌నికాదు. అందుకే రాజీ కుదుర్చుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు. అందుకే ఈ వివాదాన్ని దాస‌రి నారాయ‌ణ‌రావు ముందు పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఊపిరి సినిమా చూసి దాస‌రి ఎగ్జ‌యిట్ అయ్యారు. వంశీని పిలిపించి మాట్లాడారు. అభినందించారు. దాస‌రి ఎప్పుడూ ద‌ర్శ‌కుల ప‌క్ష‌మే. ఆయ‌నే త‌న‌కో దారి చూపిస్తార‌ని న‌మ్ముతున్నాడు వంశీ. పెద్ద‌ల‌తో కూర్చుని మాట్లాడితేగానీ.. ఈ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌దు అంటూ దిల్‌రాజు లాంటి వాళ్లు కూడా వంశీకి స‌ల‌హాలు ఇస్తున్నారు. అందుకే ఈ విష‌య‌మై వంశీ ఇప్ప‌టి వ‌ర‌కూ మీడియాతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. తాను ఏం మాట్లాడినా ఇష్యూ ఇంకా పెద్ద‌దైపోతుంద‌ని త‌న‌కు తెలుసు. దాస‌రి ముందో, ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌ల ముందో, లేదంటే ద‌ర్శ‌కుల సంఘం ముందో త‌న వాద‌న వినిపించి.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు త‌దుప‌రి స్టెప్ వేయాల‌నుకొంటున్నాడ‌ట‌. పీవీపీ తాజా ఎత్తుగ‌డ‌తో మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి సినిమా ఇబ్బందుల్లో ప‌డింది. వీట‌న్నింటికీ వంశీ ఎలా దాటుకొని వ‌స్తాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close