కుట్లు కుదిరిపోయాయ‌ట‌: వంశీ.. ఈజ్ బ్యాక్‌

మ‌న‌కున్న సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుల్లో వంశీ ఒక‌రు. ఆయ‌న సినిమా అంటే… గోదావ‌రి అందాల్ని ఎంచ‌క్కా క‌ళ్లారా చూసేయొచ్చు. స్వ‌చ్ఛ‌మైన వినోదం, ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం వంశీ చిత్రానికి ఆభ‌ర‌ణాలు. పాతికేళ్ల ప్ర‌స్థానంలో వంశీ నుంచి వ‌చ్చిన‌వి పాతిక సినిమాలే. అయినా.. స‌రే దేని మార్కు దానిదే. గ‌త కొన్నేళ్లుగా వంశీ నుంచిస‌రైన సినిమా రాలేదు. స‌ర‌దాగా కాసేపు త‌ర‌వాత వంశీ హిట్టు అందుకోలేదు. ఇప్పుడు లేడీస్ టైల‌ర్‌కి సీక్వెల్‌గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ సినిమాని రూపొందిస్తున్నారాయన‌. చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌యిపోయింది. మేలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌పై ఆశ‌లు పెంచుకోవ‌చ్చు అనిపిస్తోంది. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌రిచిన పాట‌ల‌న్నీ అద్భుతంగా వ‌చ్చాయ‌ని వినికిడి. వంశీ స్టైల్ ఉంటూనే.. అందులో మ‌ణి మ‌ర్క్ క‌నిపించ‌బోతోంద‌ట‌. దానికి తోడు గోదావ‌రి అందాల్ని మ‌రోసారి వంశీ త‌న కెమెరాలో అందంగా బంధించాడ‌ని తెలుస్తోంది. ఎమ్మెస్‌రాజు కూడా ఈసినిమాపై ప్ర‌త్యేక దృష్టి నిల‌ప‌డం, నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింద‌ని తెలుస్తోంది. కొత్త ర‌చ‌యిత‌ల‌తో వంశీ రాయించిన సంభాష‌ణ‌లు ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయ‌ట‌. ఆడియో ఫంక్ష‌న్లేమీ లేకుండా ఒక్కో పాట‌నీ ఒక్కోరోజు విడుద‌ల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని మాత్రం గ్రాండ్‌గా చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. మొత్తానికి వంశీ సినిమాకి శుభ సూచిక‌లు బాగానే వీస్తున్నాయి. వంశీలాంటోడికి హిట్ట ప‌డితే.. మంచిదేగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close