వంగవీటి రాధాకృష్ణ ఏం చేయబోతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజికవర్గం అంతా.. తమ ఐకాన్‌గా… వంగవీటి మోహనరంగానే గుర్తుంచుకుంటుంది. అలాంటి నేత కుమారుడు.. వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. వరుసగా రెండు సార్లు ఓడిపోవడం.. రాజకీయంగా.. నిర్ణయాలు తీసుకోవడంలో.. ఆలసత్వం వహించడంతో… వంగవీటి వారసుడి రాజకీయ జీవితం… ఇబ్బందుల్లో పడింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ కోసం నాలుగేళ్లుగా పని చేసుకుంటూంటే.. జగన్ ఇప్పుడు… ఆ సీటును నిన్నామొన్న పార్టీలోకి వచ్చేసిన.. మల్లాది విష్ణుకు ఇచ్చేశారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదు. విజయవాడ తూర్పు, మచిలీపట్నం పార్లమెంట్ అని జగన్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ.. ఇవి అయినా ఇస్తామని.. ఆ పార్టీ అగ్ర నేతల నుంచి ఒక్క ముక్క సమాచారం కూడా రాలేదు. జగన్ మైండ్‌సెట్‌పై అవగాహన ఉన్న ఎవరికైనా… వంగవీటి రాధాకృష్ణకు జగన్‌ హ్యాండివ్వబోతున్నారని అర్థమైపోతుంది.

మూడురోజుల నుంచి వంగవీటి అభిమానులు ఆందోళన చేస్తూంటే.. ఎంత త్వరగా రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తాడా అన్న ఆతృతను.. జగన్ మీడియా చూపిస్తోంది. మూడు రోజుల్లో జగన్ నుంచి తనకు క్లారిటీ రాకపోతే.. అందరం చర్చించి నిర్ణయం తీసుకుందామని… వంగవీటి రాధాకృష్ణ తన అభిమానులకు సర్ది చెబుతున్నారు. కానీ.. రాధాకృష్ణ ముందు..చాలా తక్కువ చాయిస్‌లు ఉన్నాయి. నిజానికి.. గౌతంరెడ్డి.. వంగవీటి రంగాను.. పాముతో పోల్చి… హత్య చేసినా తప్పు లేదని మాట్లాడిన తర్వాత… ఇక రాధాకృష్ణ.. వైసీపీలో ఉండబోరని ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. కానీ.. రాధాకృష్ణ మాత్రం వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కూడా తక్కువగానే ఉంది.

వంగవీటి రాధాకృష్ణ బద్ద శత్రువులుగా భావించే దేవినేని వారసులు… టీడీపీలోనే ఉన్నారు. అలాగే టీడీపీలో చేరినా టిక్కెట్ గ్యారంటీ లేదు. ఇక రాధాకృష్ణకు ఉన్న మరో చాయిస్ జనసేన. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున రాధాకృష్ణ పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కులముద్ర పడటమే దీనికికారణం. పీఆర్పీ అనుభవంతో జనసేనలోకి వెళ్లొచ్చు. కానీ రాధాకృష్ణకే ఆ పార్టీ మీద నమ్మకం లేనట్లు ఉంది. ఓ వైపు తొందర పడి నిర్ణయం తీసుకోద్దంటూ… వైసీపీలోని కొంత మంది నేతలు రాధాకృష్ణను తొందర పెడుతున్నారు. మరో వైపు.. రాజకీయంగా దారి కనిపించని పరిస్థితి. అందుకే వంగవీటి ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై.. బెజవాడలోనే కాదు. ఏపీలోనూ ఆసక్తి ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close