‘మిస్టర్’ వరుణ్… ప్లాప్ హీరోయిన్‌తో వన్స్ ఎగైన్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ స్టాంప్ పడితే హీరోయిన్లకు అంత త్వరగా అవకాశాలు రావు. అందులోనూ ఓ సిన్మా ప్లాప్ అయితే… అందులోని హీరోయిన్‌కి మళ్లీ అదే హీరోతో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. ఎందుకంటే… సెంటిమెంట్ కోటాలో ఆమెకు అవకాశాన్ని ఇవ్వరు. కానీ, లావణ్యా త్రిపాఠి మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్‌కి అతీతంగా అవకాశాన్ని అందుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్‌కి జంటగా లావణ్య నటించిన సినిమా ‘మిస్టర్’ ఘోరమైన ప్లాప్. ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘రాధ’, ‘యుద్ధం శరణం’ సినిమాలూ ఫ్లాపే. మధ్య ‘ఉన్నది ఒకటే జిందగీ’ తప్పిస్తే… ‘ఇంటిలిజెంట్’తో మరో ఘోరమైన ప్లాప్ ఆమె ఖాతాలో పడింది. అయితే… ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు అవేమీ లెక్కలోకి తీసుకోలేదు. వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించనున్న సినిమాలో లావణ్యా త్రిపాఠికి అవకాశం ఇచ్చారు. అందులో అదితీరావ్ హైదరి మెయిన్ హీరోయిన్. లావణ్యది సెకండ్ హీరోయిన్ రోల్. నిర్మాతలు ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.