మెగాఫోన్ ప‌డుతున్న మ‌రో రైట‌ర్‌

రైట‌ర్‌ముదిరితే డైరెక్ట‌ర్ అనేది.. టాలీవుడ్ సామెత‌. ర‌చ‌యిత‌ల‌కు ద‌ర్శక‌త్వం వైపు అడుగులు వేయ‌డం స‌హ‌జ‌మే. త్రివిక్ర‌మ్ దర్శ‌కుడిగా మారి సంచ‌ల‌న విజ‌యాలు సాధించాక‌… ఈ త‌ర‌హా వ‌ల‌స‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి, ఇప్పుడు ర‌చ‌యిత ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు త‌నే… వెలిగొండ శ్రీ‌నివాస్‌. ఢ‌మ‌రుకం, అఖిల్‌, జ‌బ‌ర్‌ద‌స్త్‌, పండ‌గ చేస్తో… ఇలా చాలా సినిమాల‌కు క‌థ అందించి ర‌చ‌యిత‌గా ప‌నిచేశాడు. ఇప్పుడు మెగా ఫోన్‌వైపు దృష్టి పెట్టాడు. యువ హీరో రాజ్ త‌రుణ్‌కి ఓ క‌థ చెప్పి ఒప్పించేశాడు వెలిగొండ‌. అతి త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది.

ఈ చిత్రానికి అనిల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సాగే ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్‌ని ట‌చ్‌చేశార‌ట‌. రాజ్ త‌రుణ్ అక్క‌డే లాక్ అయిపోయాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. మ‌రి ర‌చ‌యిత‌గా ఇప్పుడిప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేస్తున్న వెలిగొండ‌… ద‌ర్శ‌కుడిగా ఎలా విజృంభిస్తాడో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close