సేవ చేస్తున్నందుకే మిన‌హాయింపులు వ‌చ్చాయ‌ట‌!

కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య నాయుడు కుటుంబానికి చెందిన స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్టుకు తెలంగాణ స‌ర్కారు ల‌బ్ధి చేకూర్చిన్న‌ట్టు ఇటీవ‌లే ఓ క‌థ‌నం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్ల మేర ల‌బ్ధి చేకూర్చేలా తెలంగాణ స‌ర్కారు ర‌హ‌స్య జీవో జారీ చేసింద‌ని, ఆ వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌డం వెన‌క అర్థ‌మేంటంటూ కొన్ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఇదే అంశ‌మై కాంగ్రెస్ నాయ‌కుడు జైరాం రమేష్ కూడా వెంక‌య్య నాయుడుపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌పై వెంక‌య్య కార్యాల‌యం స్పందించింది. ఆ స్పంద‌న కూడా ఎలా ఉందంటే… క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా అన్న సామెత తీరుగా ఉందని చెప్పొచ్చు!

స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్టు ఎలాంటి లాభాల‌నూ ఆశించి ప‌నిచేస్తున్న‌ది కాద‌ని తెలంగాణ స‌ర్కారే చెప్పిన విష‌యాన్ని గుర్తించాల‌ని వెంక‌య్య కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ట్ర‌స్టుకు ఎలాంటి రాయితీలు అంద‌లేని ప్ర‌క‌టించింది. మ‌హిళ కోసం, నిరుద్యోగుల‌కు వృత్తి నైపుణ్యాల శిక్ష‌ణ కోసం, ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య సేవ‌లు అందించ‌డం కోసం ట్ర‌స్టు కృషి చేస్తోంద‌న్నారు. ట్ర‌స్టు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు మ‌రింత‌గా ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతోనే కొన్ని ప‌న్నుల మిన‌హాయింపులు ఇస్తున్న‌ట్టుగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని వెంక‌య్య కార్యాల‌యం పేర్కొంది. కేసీఆర్ కుటుంబంతో ఉన్న వ్యాపార సంబంధాల‌పై కూడా వెంక‌య్య ఈ సంద‌ర్భంలో స్పందించ‌డం విశేషం! త‌న కుటుంబం చేస్తున్న వ్యాపార లావాదేవీల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌నీ, అక్క‌డ ఏం జ‌రుగుతుందో కూడా త‌న‌కు తెలీద‌నీ, ఆ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటాన‌ని వెంక‌య్య స్ప‌ష్టం చేశారు. ఈ మధ్య తెలంగాణ స‌ర్కారు హ‌ర్షా టొయోటా కంపెనీ నుంచి వాహ‌నాలు కొనుగోలు చేసింద‌న్న ఆరోప‌ణ‌ల్ని కూడా వెంక‌య్య కొట్టిపారేశారు. టొయోటా కంపెనీతో తెలంగాణ స‌ర్కారు నేరుగా డీల్ చేసి, వాహ‌నాలు కొనుగోలు చేసింద‌ని చెప్పారు. ఉప రాష్ట్రపతి కాబోతున్న‌వేళ‌, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి బుర‌ద చ‌ల్ల‌డ‌మే కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం అంటూ జైరాం ర‌మేష్ పై వెంక‌య్య మండిప‌డ్డారు.

వెంక‌య్య కుటుంబానికి చెందిన ట్ర‌స్టుకు రూ. 2 కోట్లు ల‌బ్ధి చేసేలా తెరాస స‌ర్కారు ఇచ్చిన జీవోపై స‌వివ‌రంగానే మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌తంలో ఏ ట్ర‌స్టుకూ ఇంత భారీ ఎత్తున మిన‌హాయింపులు ఇస్తూ ప్ర‌భుత్వం జీవో ఇవ్వ‌లేద‌ని సాక్షాత్తూ హెచ్‌.ఎం.డి.ఎ. అధికారులు వాపోయార‌నీ వినిపించింది. దీనిపై నేరుగా స్పందించ‌కుండా… సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో ప‌న్ను మిన‌హాయింపులు వ‌చ్చిన‌ట్టు వెంక‌య్య చెప్పి, ర‌హ‌స్య జీవో గురించి ఎక్కువ‌గా మాట్లాడ‌క‌పోవ‌డం విశేషం! పోనీ, సేవ‌ల నేప‌థ్యంలో ఇచ్చిన ఆ మిన‌హాయింపులు ఆరోప‌ణ‌ల్లో వినిపిస్తున్న‌ట్టుగా రూ. 2 కోట్లా, అంత‌కంటే త‌క్కువా అనేది కూడా స్ప‌ష్టం చెబితే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close