వ్యక్తిగతంగా యాగాలు చేస్తే తప్పులేదు – వెంకయ్యనాయుడు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి తాను నిర్వహించబోతున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించారు. వెంకయ్యనాయుడు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తనను యాగానికి ఆహ్వానించారని, 24న తాను యాగానికి హాజరవుతానని చెప్పారు. యాగాలు వ్యక్తిగతంగా చేస్తే తప్పు లేదని అన్నారు. గృహనిర్మాణాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణకు మరిన్ని ఇళ్ళను మంజూరు చేయాలని కేసీఆర్ కోరారని, ప్రతిపాదనలు పంపితే ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణకు హడ్కో రు.3,100 కోట్ల రుణం మంజూరు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కూడా చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గాలను పెంచాలని ఏపీ ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు అందాయని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 117 నుంచి 153కు పెంచాలని, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగ సమస్యలు ఉన్నాయని, రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని సవరించాలా అనేదానిపై న్యాయశాఖ కార్యదర్శితో చర్చిస్తామని వెంకయ్య అన్నారు.

మరోవైపు కేసీఆర్ కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిసి యాగానికి ఆహ్వానించారు. ఇవాళ పవార్ జన్మదినం సందర్భంగా పుష్పగుఛ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పవార్ తెలంగాణ డిమాండ్‌కు మద్దతిచ్చారని, కేంద్ర మంత్రిగా బాగా పనిచేశారని కేసీఆర్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close