కొత్త క‌థ‌ల‌కు వెంకీ ‘నో’

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న `నారప్ప‌` వెంకీని బాగా నిరాశ ప‌రిచింది. నిజానికి ఈ సినిమా కోసం వెంకీ బాగానే క‌ష్ట‌పడ్డాడు. కానీ ఫ‌లితం రాలేదు. `దృశ్య‌మ్ 2` కూడా ఓటీటీకే వెళ్లిపోతోంది. ఓటీటీ రిజ‌ల్ట్ ప‌ట్ల ఎలాంటి ఆస‌క్తి లేని వెంకీ – ఈ సినిమానీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌. ఇప్పుడు త‌న చేతిలో `ఎఫ్ 3` ఒక‌టే ఉంది. ఈలోగా త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొత్త క‌థ‌ల్ని సున్నితంగా తిప్పి పంపించేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 వ‌ర‌కూ మ‌రో సినిమాపై ఫోక‌స్ చేయ‌కూడ‌ద‌ని వెంకీ భావిస్తున్నాడ‌ట‌. నిజానికి వెంకీ కోసం ఓ రీమేక్ క‌థ సిద్ధంగా ఉంది. అదే.. `విక్ర‌మ్ – వేద‌`. ఈసినిమా పై ఎప్ప‌టి నుంచో వెంకీ ఆస‌క్తి చూపిస్తున్నాడు. కానీ త‌న‌కు ఈమ‌ధ్య రీమేకులు పెద్ద‌గా క‌ల‌సి రావ‌డం లేద‌న్న ఫీలింగ్ తో ఈ సినిమా సైతం వెంకీ ప‌క్క‌న పెట్టాడ‌ని తెలుస్తోంది. వెంకీ కోసం త‌రుణ్ భాస్క‌ర్ ఓ క‌థ రెడీ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే…. వెంకీ చేయ‌బోయే సినిమా అదే. కానీ ఆ క‌థ ఎంత‌కీ సెట్ అవ్వ‌డం లేదు. దాంతో కొన్నాళ్లు వెంక‌టేష్ కొత్త క‌థ‌లు విన‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close