వెంకీ సేఫ్ గేమ్‌

స్టార్ హీరోలు సేఫ్ గేమ్ ఆడాల‌ని భావించ‌డం కొత్త‌గా అనిపించే విష‌య‌మే. ఎందుకంటే స్టార్ హీరోల‌కుండే మార్కెట్ వేరు. వాళ్లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కాక‌పోతే అనుభ‌వాలు నేర్పిన పాఠాలో.. అతి జాగ్ర‌త్తో తెలీదు గానీ వెంక‌టేష్‌, నాగార్జున లాంటి సీనియ‌ర్లు ప్ర‌తీ విష‌యంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్ మ‌ళ్లీ అలాంటి జాగ్ర‌త్త‌లే తీసుకొంటున్నాడు. వెంక‌టేష్ – న‌య‌న‌తార జంట‌గా న‌టించిన చిత్రం బాబు బంగారం. జూన్‌లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. మెల్ల‌గా జులైకి వెళ్లింది. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. కానీ ఆ ప్ర‌య‌త్నం నుంచి విర‌మించుకొన్న‌ట్టు వినికిడి.

ఈనెల 22న క‌బాలి వ‌స్తోంది. క‌బాలి బాగుండి.. సూప‌ర్ క‌ల‌క్ష‌న్ల‌తో న‌డిస్తే, వారం గ్యాప్ కూడా స‌రిపోదు. అందుకే 29న రావ‌డం క‌రెక్ట్ కాద‌ని వెంకీ అండ్ కో భావిస్తున్నారు. ఆగ‌స్టు 12న జ‌న‌తా గ్యారేజ్ వ‌చ్చేస్తోంది. ఈ రెండింటి మ‌ధ్య‌న ప‌డ‌డం.. రిస్కే. అందుకే జ‌న‌తా గ్యారేజ్ కూడా వెళ్లిపోయాక తీరిగ్గా వ‌ద్దామ‌న్న‌ది వెంకీ ప్లాన్‌. అందుకే ఇప్పుడు విడుదల తేదీ మార్చ‌డానికే బాబు బంగారం టీమ్ మొగ్గు చూపుతోంద‌ని తెలుస్తోంది. ఈనెల 20న విడుద‌ల కావాల్సిన ఆడియో కూడా వాయిదా ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close