వెంకీ @ 10 కోట్లు

టాలీవుడ్‌లో మోస్ట్ కంఫ‌ర్ట్ బుల్ హీరో ఎవ‌రంటే వెంక‌టేష్ పేరే చెబుతారంతా. కొత్త ద‌ర్శకుల‌కు ఛాన్సులివ్వ‌డంలోనూ, మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలోనూ, ప్ర‌యోగాలు చేయ‌డంలోనూ వెంకీ ముందుంటాడు. పైగా నిర్మాత‌ల‌తో పెద్ద‌గా పేచీ ఉండ‌దు. పారితోషికం విష‌యంలో నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడుతున్నాడ‌న్న ఫిర్యాదులు ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌టీ లేదు. అంత కంఫ‌ర్ట్ వెంకీ.

అయితే ఇప్పుడు ఏమైందో ఏమో.. ఒక్క‌సారిగా త‌న పారితోషికం డ‌బుల్ చేశాడు. ఎఫ్ 2 వ‌ర‌కూ వెంక‌టేష్ పారితోషికం 4 నుంచి 5 కోట్లు మాత్ర‌మే. అయితే ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఆమ‌ధ్య వెంకీతో సినిమా తీసి భారీగా న‌ష్ట‌పోయిన ఓ నిర్మాత‌.. వెంకీని క‌లిసి సినిమా చేయ‌మంటే రూ.10 కోట్లు అడిగాడ‌ని టాక్‌. ఒక్క‌సారిగా వెంకీ పారితోషికం పెంచేయ‌డంతో స‌ద‌రు నిర్మాత షాక్ అయ్యాడ‌ట‌. కేవ‌లం ఆ నిర్మాత‌కే ఈ `డ‌బుల్‌` ఆఫ‌రా? అని ఆరా తీస్తే… ‘ఎఫ్ 3’కీ అంతే ఎమౌంట్ కోడ్ చేశాడ‌ని తెలిసింది. వెంక‌టేష్ సినిమా అంటే క్లాస్ ఆడియ‌న్స్ ఓటేస్తారు. కుటుంబ ప్రేక్ష‌కులు వెంకీ చిత్రాల్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. థియేట‌ర్ ప‌రంగా వ‌సూళ్లు అటూ ఇటూగా వ‌చ్చినా, టీవీల్లో, ఓటీటీ వేదిక‌ల్లో వెంకీ సినిమాల్ని రిపీటెడ్‌గా చూస్తారు. వెంకీ సినిమాకి ఛాన‌ళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. పైగా ఎఫ్ 2, వెంకీ మామ విజ‌యాల‌తో వెంకీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో.. ఇదే అదును గా పారితోషికాన్ని పెంచుకున్నాడు. డిమాండ్‌ని బ‌ట్టే క‌దా స‌ప్లై. అదే సూత్రం వెంకీ మామా కూడా అన్వ‌యించుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close