ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి ధైర్యం కావాలి: వెంకీ అట్లూరి ఇంటర్వ్యూ

‘తొలిప్రేమ’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి, మలి విజయం కోసం ‘మిస్టర్ మజ్ను’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్ అక్కినేని హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా వెంకీ అట్లూరితో ఇంటర్వ్యూ..

సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది? రిలీజ్ టెన్షన్స్ తగ్గాయా?

విడుదల రోజు వరకు టెన్షన్ టెన్షన్ గా ఉన్నాను. ఖతార్ లో ఫస్ట్ షో పడింది. అక్కడినుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో రిలాక్స్ అయ్యాను. హైదరాబాదులో 11 గంటలకు థియేటర్ కు వెళ్లి సినిమా ప్రశాంతంగా చూశా. ప్రేక్షకులందరూ చాలా బావుందని అంటున్నారు. సో.. ఐ యామ్ హ్యాపీ!

‘తొలిప్రేమ’తో పోలిస్తే ఈ చిత్రానికి ఎక్కువ క్రిటిసిజం వచ్చినట్టుంది?

కామన్ ఆడియన్స్ నుంచి క్రిటిసిజం రాలేదు. రివ్యూల్లో కొంత క్రిటిసిజం వచ్చింది. ‘తొలిప్రేమ’కు రివ్యూలు బాగా వచ్చాయి. అప్పుడు సంతోషించాను. ఇప్పుడు రివ్యూలు సరిగా రాలేదని రాసిన వారిపై కోపం వ్యక్తం చేయడంలో అర్థం లేదు. రివ్యూ రైటర్స్ ని నేను గౌరవిస్తా. వారి విమర్శలను స్వీకరిస్తా.

‘రియల్ లైఫ్ లో వెంకీ అట్లూరి ఎలా అయితే ఉండాలనుకున్నాడో.. సినిమాలో హీరో క్యారెక్టర్ ను అలా డిజైన్ చేశాడు. తనే మిస్టర్ మజ్ను’ అని అఖిల్ అన్నారు. మీరేమంటారు?

‘ఎలా ఉండాలనుకున్నాడో.. ‘ అని అఖిల్ చెప్పాడు. అలా ఉన్నానని అనలేదు. రియల్ లైఫ్ లో అలా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. నాకంత ధైర్యం లేదు. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ అది.

‘మిస్టర్ మజ్న’ కథ విన్నాక సినిమా చూశాక నాగార్జున గారు చెప్పిన మార్పులేంటి?

‘ప్రేమనగర్’ సినిమాలో ఏఎన్ఆర్ గారి పాత్ర స్ఫూర్తితో ‘మిస్టర్ మజ్ను’లో హీరో పాత్రను రాసుకున్నా. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్’ డైలాగ్ తీసుకున్నా. ‘సినిమాలో వాటిని ఎలా చూపిస్తారో జాగ్రత్త’ అని నాగార్జునగారు అన్నారు. అంతే తప్ప.. పెద్దగా మార్పులేమీ చేయలేదు.

ఓ సన్నివేశాన్ని నాగార్జున సలహాతో రీ షూట్ చేశామని అఖిల్ అన్నారు?

పబ్ లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశం అది. అందులోనూ పెద్దగా మార్పులేమీ చేయలేదు.

‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ మీ గురించి చాలా మాట్లాడారు. ఇద్దరూ మంచి స్నేహితులని అన్నారు. ఆయనతో సినిమా ఎప్పు డు ఉంటుంది?

నిజంగా… ఆ రోజు వరకూ నాతో ఎప్పుడు తొలిప్రేమ సినిమా గురించి ఎన్టీఆర్ మాట్లాడలేదు. సినిమా బాగా తీశానని చెప్పలేదు. వేలాది మంది ప్రేక్షకుల ముందు మెచ్చుకున్నారు. దటీజ్ ఎన్టీఆర్. తనతో సినిమా చేయాలంటే నాకు మరింత అనుభవం కావాలి. అంత పెద్ద స్ట్రెచర్, స్టార్ డమ్ ఉన్న హీరోతో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని పోగేసుకుని ఒక కథ రాసినప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తా.

మీ నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ తో అని ప్రచారం జరుగుతోంది?

‘మిస్టర్ మజ్ను’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో 24వ తేదీ సాయంత్రం హైదరాబాద్ వచ్చా. వార్తలేవి చదవలేదు. ప్రస్తుతానికి ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాను. ఓ పది రోజుల తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా. మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేయాలి.

మైత్రి నిర్మాతలు కాకుండా ఇంకా ఎంత మంది నిర్మాతలు నీకు అడ్వాన్సులు ఇచ్చారు?

అడ్వాన్సులు తీసుకోవడం నాకు నచ్చదు. మనకున్న కమిట్మెంట్స్ పూర్తి కావడానికి టైం పట్టొచ్చు లేదా ఏవో కారణాల వల్ల సినిమాలు చేయడం ఆలస్యం కావచ్చు. అందుకని నేను అడ్వాన్సులు తీసుకోను. తీసుకుంటే బ‌ర్డెన్‌ కింద ఫీల్ అవుతా. మనకు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ లు కట్టడం అస్సలు నచ్చదు.

ఇండస్ట్రీకి హీరో గా వచ్చారు. దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు ఎవరైనా హీరోగా చేయమంటే చేస్తారా?

అస్సలు చేయను. ‘మిస్ట‌ర్ మ‌జ్ను’లో ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకున్న‌ట్టుంద‌ని అఖిల్ డైలాగ్ చెబుతాడు క‌దా! మేక‌ప్ వేసుకుంటే నేనూ అలాగే ఫీల‌వుతా. మేక‌ప్ కాదు క‌దా.. క‌నీసం పౌడ‌ర్ కూడా పూసుకోను .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close