అఫీషియల్‌: మైత్రీలో వెంకీ అట్లూరి

వరుణ్‌తేజ్‌ ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతో విజయాన్ని అందుకోవడమే కాదు.. తనలో ప్రతిభ వుందని చాటిచెప్పాడు. ఆ సినిమా తరవాత వెంకీ అట్లూరితో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు. కొందరు అడ్వాన్సులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే… దర్శకుడిగా తన రెండో చిత్రాన్ని తొలి చిత్రం నిర్మించిన బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంస్థలో చేశాడు. మూడో చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో చేయనున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ధృవీకరించారు. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ విజయాలతో తెలుగు సినిమా పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మైత్రి సంస్థ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’, విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు నిర్మిస్తున్నది. త్వరలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించే అవకాశాలు సుస్పష్టంగా వున్నాయి. బహుశా.. ‘మిస్టర్ మజ్ను’ విడుదల తరవాత కొంత సమయం తీసుకుని ప్రారంభిస్తారేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close