‘కాశీ’ ట్రైల‌ర్‌: మ‌రో మిక్చ‌ర్ పొట్లాం


బిచ్చ‌గాడుతో తెలుగులో తెగ పాపుల‌ర్ అయిపోయాడు విజ‌య్ ఆంటోనీ. ఆ సినిమాకు క‌ల‌క్ష‌న్ల క‌న‌క‌వ‌ర్షం కురిసింది. తెలుగులో విజ‌య్‌కి త‌న‌కంటూ ఓ మార్కెట్ ఏర్ప‌డింది. అయ‌తే ఆ త‌ర‌వాత వ‌చ్చిన సినిమాలు అంత‌గా ఆడ‌లేదు. ఇప్పుడు అత‌న్నుంచి వ‌స్తున్న మ‌రో అనువాద చిత్రం `కాశి`. త‌మిళంలో `కాళి`గా విడుద‌ల అవుతోంది. ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ విడుద‌లైంది. బిచ్చ‌గాడు ఎఫెక్టేమో.. అమ్మ సెంటిమెంట్ తో ఈ ట్రైల‌ర్‌ని ప్రారంభించారు. ఓ పాము చూపించి… థ్రిల్ల‌ర్ బిల్డ‌ప్ ఇచ్చారు. ఆ త‌ర‌వాత అంజ‌లి, సున‌య‌న‌ల‌ను చూపించి ల‌వ్ స్టోరీగా మ‌ర్చారు. త‌మిళ వాస‌న కొట్టే కామెడీ సీన్లూ ఇందులో క‌నిపించాయి. అన్నింటికంటే ముఖ్యంగా విజ‌య్ అంటోనీ ఎప్ప‌టిలానే నాలుగైదు గెట‌ప్పుల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. పున‌ర్జ‌న్మ‌కు సంబంధించిన క‌థాంశం అనిపిస్తోంది. థ్రిల్ల‌రూ, యాక్ష‌నూ, కామెడీ ఇలా ఓ మిక్చ‌ర్ పొట్లాంలా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిలానే త‌మిళ వాస‌న‌లు ఎక్కువ ఉన్నాయి. క‌థ‌లో కొత్త పాయింట్ ఏమైనా క‌నిపిస్తే.. మిగిలిన లోటు పాట్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌రు తెలుగు ప్రేక్ష‌కులు. మ‌రి ఆ కొత్త‌ద‌నం క‌థ‌లో, ఉందో, లేదో? ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.