విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి వెరైటీ టైటిల్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా కొన్ని చిన్న సినిమాల్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌ని హీరోగా మార్చి ఓ సినిమా తీయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. పెళ్లి చూపుల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బ్రేక్ ఇచ్చింది త‌రుణ్ భాస్క‌రే. ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాడ‌న్న‌మాట‌. ఈ చిత్రం కోసం వెరైటీ టైటిల్‌ని ఎంచుకున్నాడు విజ‌య్‌. అదే.. ‘మీకు మాత్ర‌మే చెబుతా’. ఇదో థ్రిల్ల‌ర్ క‌థ‌ని స‌మాచారం. క‌థ‌లోని మ‌లుపులు ఆస‌క్తిక‌రంగా సాగుతాయ‌ని, వినోదానికి పెద్ద పీట వేశార‌ని తెలుస్తోంది. త‌రుణ్ భాస్క‌ర్ లోనూ ఓ న‌టుడున్నాడ‌ని `ఫ‌ల‌క్ నామా దాస్‌`లాంటి సినిమాలు నిరూపించాయి. హీరోగా త‌రుణ్ ఎలా ఉంటాడో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close