త‌మిళ రాజ‌కీయాల‌పై ‘అర్జున్ రెడ్డి’ సెటైర్‌..??

పొలిటిక‌ల్ నేప‌థ్యంలో క‌థ‌ల‌కు కొత్త ఊపు వ‌చ్చింది. ‘భ‌ర‌త్ అనే నేను’ పొలిటిక‌ల్ స్టోరీనే. ‘రంగ‌స్థ‌లం’లోనూ రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న ఉంది. ‘ఓట‌ర్‌’ టైటిల్ చూస్తే ఇదే త‌ర‌హా చిత్ర‌మో తెలిసిపోతుంది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అలాంటి క‌థే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు విజ‌య్‌. ఇప్పుడు స్డూడియో గ్రీన్ సంస్థ‌లో ఓసినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈరోజే ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఇదో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని స‌మాచారం. వార‌స‌త్వ రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగ‌బోతోంద‌ట‌. మ‌రీ ముఖ్యంగా త‌మిళ నాడు రాజ‌కీయాల‌పై సెటైరిక్‌గా సాగుతుంద‌ని తెలుస్తోంది. త‌మిళ నాట రాజ‌కీయాలు ఉప్పుడూ ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. సినీ ఫ‌క్కీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటుంది. వాటి నేప‌థ్యంలోనే ఈసినిమా సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని త‌మిళంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. కాబ‌ట్టే త‌మిళ రాజ‌కీయాల్ని టార్గెట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close