ఈ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

సినిమా ప్ర‌మోష‌న్లు ఇప్పుడు కొత్త రూపం దాల్చుతున్నాయ్‌. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ని వేదిక చేసుకుని… ప్ర‌మోష‌న్ల‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్తున్నారు. ట్విట్ట‌ర్ సాక్షిగా చేసుకునే స‌ర‌దా సంభాష‌ణ‌లు కూడా ప్ర‌మోష‌న్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ‘గీత గోవిందం’ కోసం ఇప్పుడు అదే చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మ‌డ‌న్నా. వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రీ లుక్ తో ప్ర‌మోష‌న్ ఈవెంట్‌ని మొద‌లెట్ట‌బోతున్నారు. అందుకోసం ట్విట్ట‌ర్‌లో విజ‌య్‌, ర‌ష్మిక స‌ర‌దాగా సంభాషించుకున్నారు.

రష్మిక : `ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట‌ర్ అట క‌దా.. కంగ్రాట్స్‌`
విజ‌య్‌: అవార్డులో ఏముంది మేడ‌మ్‌, మీలాంటి వాళ్లు న‌న్ను ప్రేమించ‌డం చాలు.. గీతా మేడ‌మ్‌
ర‌ష్మిక‌: ఇగో గోవిందం, ఈ ఓవ‌రాక్ష‌నే త‌గ్గించుకోమ‌నేది.. అస‌లు నీకు కాదు. ప్ర‌భాస్ కో, తార‌క్ కో ఇస్తే.. మాకు ఈ గొడ‌వ వ‌దిలిపోయేది

ఇలా.. సాగింది ట్విట్ట‌ర్‌లో వీళ్ల సంభాష‌ణ‌. ఇదంతా గీతా గోవిందం ప్ర‌మోష‌న్ల కోస‌మ‌ని అర్థ‌మైపోతోంది. ప్ర‌మోష‌న్ ఐడియా బాగుంది. ఇవే తెలివితేట‌లు సినిమాల్లోనూ చూపిస్తే బాగుంటుంది. మ‌రి ప‌ర‌శురామ్ ఏం చేస్తాడో, ఏంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close