విశ్వ‌క్‌ Vs విజ‌య్ … ఏం జ‌రుగుతోంది?

పబ్లిసిటీ కోసం చేస్తున్నాడో, లేదంటే ఈగో హ‌ర్ట‌యి ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో తెలీదు గానీ – విశ్వ‌క్ సేన్ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ, హీరోగా న‌టించి నిర్మించిన `ఫ‌ల‌క్ నుమాదాస్‌`కి ఎలాక్కావాలంటే అలా ప‌బ్లిసిటీ ర‌ప్పించేసుకున్నాడు విశ్వ‌క్‌. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప‌రోక్షంగా సెటైర్లు వేస్తూ రౌడీ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టాడు. వాళ్లేమో సినిమా చూసి `ఇదేం సినిమా` అంటూ ట్రోళ్ల‌మీద ట్రోళ్లు చేస్తూనే ఉన్నారు. ఇవ‌న్నీ చూస్తూ.. విశ్వ‌క్ మండిప‌డుతున్నాడు. విజ‌య్ ఫ్యాన్స్ అంతు చూస్తానంటూ… రెచ్చిపోయి మ‌రీ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఈరోజు.. హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాడ‌ట‌. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం… ఈ గొడ‌వ‌ని మ‌రింత కెలుక్కోవ‌డ‌మే అని టాక్‌. సినిమా ఇప్ప‌డు థియేట‌ర్ల‌లో ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడినా – త‌న సినిమాకి ప‌బ్లిసిటీనే. అందుకే విశ్వ‌క్ క‌య్యానికి కాలు దువ్వుతున్నట్టు అనిపిస్తోంది.

హీరో ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం మామూలే. చిరంజీవి – బాల‌య్య ఫ్యాన్స్ మ‌ధ్య‌యితే లెక్క‌లేన్ని సార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. లేటెస్ట్‌గా ప‌వ‌న్ – ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య కూడా ఇలాంటివే న‌డుస్తున్నాయి. అయితే హీరోలెవ‌రూ మైకులు ప‌ట్టుకుని – త‌మ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్ట‌లేదు. అస‌లు ఆ గొడ‌వ‌ల‌కూ, త‌మ‌కూ సంబంధం లేన‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. రెండు సినిమాలు చేశాడో లేదో… విశ్వ‌క్ – త‌న‌కంటూ ఓ పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంద‌న్న భ్ర‌మ‌లో ఉన్నాడు. ఉంటే ఉన్నాడు… ఇలా మైకు ప‌ట్టుకుని – రెచ్చిపోవ‌డం ఏమిటో అర్థం కాదు. ఇన్ స్ట్రాగ్రామ్‌లో బాక్సాఫీసుపై కూసిన కూత‌కి ఇప్ప‌టికే ఇండ్ర‌స్ట్రీలో చాలామంది విశ్వ‌క్ యాటిట్యూడ్ గురించి నెగిటీవ్‌గా మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. వాటిని ప‌ట్టించుకోకుండా ఇలా పేట్రేగిపోతే – ప‌బ్లిసిటీ అయితే వ‌స్తుంది. కానీ.. విశ్వ‌క్ ఇమేజ్‌పై, త‌న కాండెక్ట్ స‌ర్టిఫికెట్‌పై ఓ మ‌చ్చ ప‌డిపోతుంది. అప్పుడు చేసేదేం ఉండ‌దిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close