విజ‌య్‌తో బాల‌య్య అన్ స్టాప‌బుల్‌

ఆహాలో… నంద‌మూరి బాల‌కృష్ణ‌ అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికి రెండు ఎపిసోడ్లు అయ్యాయి. మోహ‌న్ బాబు, నానిల‌తో…. బాల‌కృష్ణ షో న‌డిపించాడు. ఈ రెండు ఎపిసోడ్ల‌కూ మంచి వ్యూవ‌ర్ షిప్ వ‌చ్చింది. ఇప్పుడు మూడో గెస్ట్ గా.. విజ‌య్ దేవ‌ర‌కొండ రాబోతున్నాడ‌ట‌. విజయ్ ఇంట‌ర్వ్యూల‌న్నీ లైవ్లీగానే ఉంటాయి. సో… ఈ ఎపిసోడ్ మ‌రింత ర‌క్తి క‌ట్టే అవ‌కాశం ఉంది. కాక‌పోతే ఈ ఎపిసోడ్ కాస్త ఆల‌స్యంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే… విజయ్ ఇప్పుడు లైగ‌ర్ షూటింగ్ కోసం ఫారెన్‌లో ఉన్నాడు. మ‌రోవైపు బాల‌కృష్ణ‌కు చిన్న‌పాటి ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆయ‌న ప్ర‌స్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. విజయ్ ఫారెన్ నుంచి రాగానే…. ఈ షోని షూట్ చేస్తార్ట‌. అప్ప‌టికి… బాల‌కృష్ణ కూడా రెడీ అయిపోతారు. క్రిష్‌, పూరి జ‌గన్నాథ్‌ల‌తో కూడా ఈ టాక్ షో ఉండ‌బోతోంద‌ని, వాళ్ల ఎపిసోడ్స్ కూడా త్వ‌ర‌లో తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. చిరంజీవితో బాల‌య్య టాక్ షో చేయిస్తే.. అదిరిపోతుంది. అల్లు అర‌వింద్ ప్లాన్ కూడా అదేన‌ట‌. మ‌రి వీరిద్ద‌రి భేటీ ఎప్పుడో చూడాలి. బ‌హుశా ఈ సీజ‌న్‌లో లాస్ట్ ఎపిసోడ్ చిరుతోనే ప్లాన్ చేయొచ్చు. ఆ ర‌కంగా.. ఈ సీజ‌న్‌కి ఓ ఘ‌న‌మైన ముగింపు ఇచ్చేట్టు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close