విజయ్ మాల్యానా…విదేశాలకు ఎప్పుడో చెక్కేశాడుగా!

“విజయ్ మాల్యానా…ఆయనెప్పుడో విదేశాలకు పారిపోయాడుగా!” ఈ మాట అన్నది ఎవరో మామూలు మనిషి కాదు…ఏదో మామూలు ఖైదీ గురించి అంతకంటే కాదు. సుమారు డజను బ్యాంకులకి రూ.9000 కోట్లు పంగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత, పెద్దల సభ (రాజ్యసభ) గౌరవ సభ్యుడు విజయ్ మాల్యా గురించి…భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ సుప్రీం కోర్టు చెప్పిన మాట ఇది.

దేశంలో, విదేశాలలో ఉన్న ఆయన స్థిర, చరాస్తులన్నిటినీ అమ్మినా కూడా బ్యాంకుల దగ్గర ఆయన తీసుకొన్న అప్పులు తీర్చే పరిస్థితి కూడా లేదని కూడా రోహాత్గీ చెప్పినప్పుడు జస్టిస్ కురియన్ జోసఫ్, జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం షాక్ అయ్యింది. “మరి ఏమి చూసి బ్యాంకులు ఆయనకి అంత డబ్బు అప్పుగా ఇచ్చేయి?” అని వారు ప్రశ్నిస్తే అందుకు రోహాత్గీ చెప్పిన సమాధానంతో వారిరువురూ ఇంకా షాక్ తిన్నారు. “విజయ్ మాల్యాకి వ్యక్తిగతంగా ఉన్న పేరు ప్రతిష్టలు, ‘కింగ్ ఫిషర్’ పేరిట ఆయన చేస్తున్న మద్యం మరియు విమానయాన వ్యాపారాలను చూసి” అని రోహాత్గీ జవాబు చెప్పారు.

అంత భారీ స్థాయిలో వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి తమకు అంత పెద్ద కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోతాడని ఆయనకు అప్పిచ్చిన బ్యాంకులు కలలో కూడా ఊహించలేకపోయాయి. నిజానికి గత మూడు నాలుగేళ్ల క్రితం నుంచే విజయ్ మాల్యా ఆర్ధిక పరిస్థితి చాల వేగంగా దిగజారడం మొదలయింది. అప్పటి నుండే ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకులు ఒత్తిడి చేయడం ప్రారంభించాయి కానీ ఆయన అవేమీ పట్టనట్లుగా చాలా కులాసాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రోజులు దొర్లించేసారు. ఇక నేడోరేపో కోర్టుకి, అక్కడి నుండి తీహార్ జైలుకి తీసుకువెళ్ళడం ఖాయం అని అనుమానం కలుగగానే ఆయన గుట్టు చప్పుడు కాకుండా మార్చి 2న లండన్ పారిపోయారు. ఆ సంగతి సిబీఐ దృవీకరించిందని రోహాత్గీ సుప్రీం కోర్టుకి చెప్పుకోవడం సిగ్గు చేటు. అతను విదేశాలకు పారిపోతున్నాడని తెలిసి కూడా అరెస్ట్ చేయకుండా ఆయన ప్రయాణ వివరాలను మాత్రమే నోట్ చేసుకోవడం చాలా గొప్ప విషయమే.

రెండువారాలలోగా తన ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు లండన్ కి పారిపోయిన ఆయనకి నోటీస్ పంపింది. అరెస్ట్ భయంతోనే లండన్ పారిపోయిన అతను నోటీస్ వచ్చిందని మళ్ళీ డిల్లీకి వస్తాడనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ ఇంతకంటే వేరే గత్యంతరం లేదు కనుక ఆయనొస్తాడని…వచ్చి అప్పులు తీర్చేస్తాడని లేకుంటే తీహార్ జైలుకి వెళ్తాడని ఆశగా ఎదురుచూడక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close