ఇప్పుడప్పుడే భారత్ కి తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేదు: విజయ్ మాల్యా

బ్యాంకులకి సుమారు 9,000 కోట్లు రూపాయిలు ఎగవేసి లండన్ పారిపోయినట్లు భారత్ మీడియాలో వస్తున్న వార్తలను కింగ్ ఫిషర్ సంస్థ యజమాని విజయ్ మాల్యా ఖండించారు. బ్రిటన్ కి చెందిన ఒక ప్రముఖ అంతర్జాతీయ దినపత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “భారత్ లో నాపై మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. దానిని నేను ఖండిస్తున్నాను. నేను ఏడు పెద్దపెద్ద బ్యాగులు పట్టుకొని పారిపోయి ఇక్కడికి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. వ్యాపారాలలో ఎగుడుదిగుడులు సాధారణమయిన విషయమే. నేను కూడా వ్యాపారంలో నష్టపోయిన మాట వాస్తవమే. అయితే అది వ్యాపారానికి సంబందించిన విషయంగానే చూడకుండా నేనేదో క్రిమినల్ అన్నట్లు భారత్ మీడియా అభివర్ణిస్తోంది. ఆ కారణంగా దేశంలో నాపట్ల తీవ్ర వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితులలో భారత్ వెళ్ళడం మంచిది కాదని నేను భావిస్తున్నాను కనుక ఇప్పుడప్పుడే భారత్ వెళ్ళదలచుకోలేదు. అక్కడ పరిస్థితులు చల్లబడ్డాకనే వెళతాను. నేను భారత న్యాయస్థానాలకు మాత్రమే జవాబుదారిగా ఉంటానే తప్ప మీడియాకి కాదు. కనుక మీడియాతో నేను మాట్లాదదలచుకోలేదు. కనుక భారత్ మీడియా నన్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించనవసరం లేదు. అది దానికి సాధ్యం కాదు కూడా,” అని విజయ్ మాల్యా చెప్పారు.

భారత్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని విజయ్ మాల్యా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయనకు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశంతో బ్యాంకులు కూడా నోటీసులు జారీ చేస్తున్నాయి. సిబీఐ ఏడాది క్రితమే ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆ కేసు ఆధారంగా ఈడి కూడా ఆయనపై, ఆయన సంస్థలో పని చేసే ఉన్నతాధికారులపై, ఆయనకు అప్పిచ్చిన ఐ.డి.బి.ఐ. బ్యాంక్ అధికారులపై కూడా కేసులు నమోదు చేసి అందరికీ నోటీసులు పంపిస్తోంది. ఇవ్వన్నీ విజయ్ మాల్యా ఒక ఆర్ధిక నేరస్తుడని చెప్పడానికి ప్రత్యక్షాధారాలుగా కనిపిస్తున్నప్పుడు, అదే విషయం మీడియా వ్రాస్తే ఆయనకి కష్టం అనిపిస్తోంది. జాతి సంపదను తన విలాసాలకు, వ్యాపారాలకు ఇష్టం వచ్చినట్లు వాడుకొని, బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా గురించి మీడియా ప్రజలకు తెలియజేయడం ఆయన తప్పుగా భావిస్తున్నట్లయితే, ఆయన చేసిన, చేస్తున్న తప్పుల మాటేమిటి? బ్యాంకులను మోసం చేయడం, మోసం చేసి గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు పారిపోవడం, సుప్రీం కోర్టు, బ్యాంకులు, ఈడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసి ఉన్నప్పటికీ ఇప్పుడప్పుడే భారత్ తిరిగి రాబోనని చెప్పడం అన్నీ కూడా క్షమార్హం కాని తప్పులే. అన్ని తప్పులు చేస్తూ మళ్ళీ మీడియాని నిందిస్తూ తప్పించుకోవాలని చూడం కూడా మరో పెద్ద తప్పు. అటువంటి ఆర్ధిక నేరస్థుడిని భారత్ కి తిరిగి రప్పించి చట్ట ప్రకారం శిక్షించలేకపోతే అది భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకి కూడా అవమానంగానే భావించవలసి ఉంటుంది.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close