అరుణ్ జైట్లీకి ఓ మాట చెప్పే పారిపోయాడట విజయ్ మాల్యా..!

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన… విజయ్ మాల్యా.. సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాను లండన్‌కు పారిపోయే ముందు.. ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీకి చెప్పానంటున్నారు. లండన్‌ కోర్టుకు హాజరైన విజయ్ మాల్యా.. ఈ విషయాన్ని స్పష్టంగా మీడియాకు చెప్పారు. కోర్టులోనూ చెప్పారు. ఆర్థిక మంత్రిని కలిసి, బ్యాంకులతో ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు సెటిల్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేసినట్టు మాల్యా ప్రకటించారు. “దేశం విడిచి రావడానికి కంటే ముందు పార్లమెంట్‌ ఆవరణలో జైట్లీని కలిశాను. లండన్‌ వెళ్తున్నట్టు చెప్పాను..” అని ప్రకటించేశారు. ఈ విషయం ఒక్కసారిగా హైలట్ అయింది. దీంతో విపక్షాలు.. కేంద్రంపై విమర్శలు ప్రారంభించాయి.

విజయ్ మాల్యా స్టేట్‌మెంట్‌పై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆయనను కలవలేదని చెప్పుకొచ్చారు కానీ.. మాల్యా చెప్పినట్లుగా.. తమ మధ్య సంభాషణ జరిగినట్లు అంగీకరించారు. రాజ‌్యసభ సభ్యుడిగా ఉన్నదున.. పార్లమెంట్ ఆవరణలో తనతో మాట్లాడటానికి విజయ్ మాల్యా ప్రయత్నించారని… సెటిల్మెంట్‌కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. కానీ బ్యాంకులతోనే మాట్లాడుకోమని.. సమాధానం ఇచ్చినట్లు జైట్లీ చెప్పుకొచ్చారు. ఆయన చేతులో ఉన్న పేపర్లు నాకు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకోలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. అయితే లండన్‌కు వెళ్లిపోతున్న విషయం చెప్పారా..? లేదా..? అన్న విషయాన్ని మాత్రం.. జైట్లీ బయటపెట్టలేదు.

దేశంలో బ్యాంకుల్లో పెరిగిపోయిన నిరర్థక ఆస్తులు. దేశం విడిచిపోతున్న ఆర్థిక నేరగాళ్ల వ్యవహారం కలకలం రేపుతున్న తరుణంలో మాల్యా ప్రకటన .. బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. విపక్షాలు దీన్నో అస్త్రంగా మలుచుకున్నాయి. నీరవ్‌మోదీ, మెహుల్‌చౌక్సిలు కూడా శిక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వ అనుమతితోనే దేశం విడిచి పారిపోయారని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిరవ్ మోదీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత అసమర్థత భారత ప్రభుత్వానిదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి కేంద్రం తప్పించుకోలేని విధంగా.. విజయ్ మాల్యా.. గట్టి దెబ్బే కొట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close