పరువు పోతుందనే తీసేశారు – ఎంత దిగజారిపోయాడో వీ.సా.రెడ్డికి అర్థం అవుతోందా?

విజయసాయిరెడ్డికి రాజ్యసభలో ప్యానల్ వైస్ చైర్మన్ పోస్ట్ ను ప్రకటించి రద్దు చేశారు. అదీ అవమానకరంగా. రాజ్యసభ కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఆయన కూడా తన పేరు చూసుకుని మురిసిపోయి ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతికి ధ్యాంక్స్ చెప్పారు. కానీ రాజ్యసభలో అధికారిక ప్రకటన చేస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్ , ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాత్రం.. ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితా పునర్‌వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. ఎనిమిదో పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును ప్రస్తావించలేదు. దీంతో ఆయన పేరు తొలగించినట్లుగా స్పష్టమయింది.

చివరి క్షణంలో విజయసాయిరెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్ ఎందుకు తొలగించారో ఢిల్లీ రాజకీయవర్గాలకు స్పష్టంగా తెలుసు. అది విజయసాయిరెడ్డికి కూడా తెలుసు. విజయసాయిరెడ్డి నియామకం గురించి బయటకు తెలిసిన తర్వాత ఆయన తీరుపై రాజ్యసభ చైర్మన్‌కు పలువురు ఫిర్యాదులు చేశారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వాడే భాషను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు ఏ మాత్రం గౌరవ మర్యాదలు లేవని.. అలాంటి వ్యక్తిని రాజ్యసభ చైర్మన్ చైర్‌లో కూర్చోబెడితే ఆ పదవికే అగౌరవం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను.. ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్ లేషన్ చేసి మరీ.. రాజ్యసభ చైర్మన్‌కు పంపారు.

ఆయన ఎంత లేకి మనిషో ఉపరాష్ట్రపతికి అర్థం కావడంతో ముందుగా నిర్ణయం తీసుకుని కూడా కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ప్యానల్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి ట్వీట్లు చూసిన వారు.. బయట జెంటిల్మెన్‌లా కనిపించే ఆయన ఇంత అసభ్యకరంగా తోటి రాజకీయ నేతల్ని.. వారి కుటుబాల్ని వ్యక్తిగతంగా ఎలా దూషించగలరని ఆశ్చర్యపోతూంటారు. ఇప్పటికైనా తాను ఎంత దిగజారిపోయాడో.. విజయసాయిరెడ్డి అర్థం చేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close