తప్పేంటి ? భూదందాపై విజయసాయిరెడ్డి రియాక్షన్ !

మర్డర్లు చేసి..ఖూనీలు చేసి.. కబ్జాలు చేసి.. తప్పేంటి అని వాదించే బరితెగింపు వైసీపీ నేతలకు వచ్చింది. విశాఖలో భూదందాపై విజయసాయిరెడ్డి ఇదే వాదన వినిపించారు. భూముల కబ్జాల గురించి ఆధారాలతో సహా బయటపడితే విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సామాజికవర్గం, ఉత్తరాంధ్రపై కుట్ర, సొంత మీడియా పెట్టుకుంటా.. అంటూ.. పొంతలేని వాదనలతో ఎదురుదాడికి దిగారు. మూడు రోజుల నుంచి ఎలా స్పందించాలో తెలియక కిందా మీదా పడుతున్న ఆయన చివరికి అసలు విషయాలు చెప్పకుండా తప్పేంటి అనే వాదనతో సమర్థించుకోవడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒక్క దానికీ నేరుగా సమాధానం చెప్పలేదు. అన్నీ ఎదురుదాడి చేసి తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో అసలు కొసమెరుపేమిటంటే.. తాను కూడా సొంత మీడియాను పెడతానని ప్రకటించుకోవడం.

దసపల్లా భూములు ప్రైవేటువే.. ఇచ్చేస్తే తప్పేంటి ?

దసపల్లా భూములు ప్రైవేటువేనని విజయసాయిరెడ్డి తేల్చేశారు. అందుకే 22ఏ జాబితాలో నుంచి తీసేశామన్నారు. అసలు అలా తీసేయాలని నిర్ణయించే అధికారం విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారో కానీ.. ఆయన మాత్రం ప్రభుత్వ ప్రతినిధిలాగా మాట్లాడేశారు. దసపల్లా భూములు ప్రభుత్వానివేననని ..వైసీపీ కూడా వాదించింది. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు ఆ భూముల్ని కబ్జా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. తీరా ఎన్నికలైపోయాక.. అవి ప్రైవేటు భూములేనని అడ్డంగా వాదించడమే కాదు.. వాటిని 22ఏ నుంచి తీసేశామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. గోపీనాథ్ రెడ్డి అనే బినామీ పేరుతో 75 శాతం భూముల్ని విజయసాయిరెడ్డే ఆక్రమించుకున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపై ఆయన ఎదురుదాడే సమాధానం అయింది.

కూతురు, అల్లుడు కొనుక్కున్నారు..తప్పేంటి ?

తనకు ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉందని.. తన కూతురు, అల్లుడు కూడా విశాఖలో ఎలాంటి ఆస్తులు కొనలే్దని ఆయన గతంలో వాదించారు. ఇప్పుడు ఆధారాలతో సహా ఆయన కుమార్తె, అల్లుడు కొన్న ఆస్తులను బయటపెడితే.. ఆ లావాదేవీలతో తనకేం సంబందం లేదని వాదిస్తున్నారు. వాళ్లు ఎప్పటి నుండో వ్యాపారం చేస్తున్నారని చెబుతున్నారు. బోగాపురం ఎయిర్ పోర్టు రోడ్ ఎలైన్ మెంట్ మారిందని.. ఆయన కుమార్తె, అల్లుడు భూముల పక్క నుంచి ఎలా వెళ్లిందనేదానికి మాత్రం సమాధానం చెప్పలేదు. పైగా బ్రహ్మణి కొనుక్కుంటే..బాలకృష్ణకేం సంబంధం ఉటుందని వదించారు.

సొంత మీడియా పెడుతున్నానని సవాల్ !

రామోజీరావుకు సొంత మీడియా ఉందనే ఇలా చేస్తున్నారని… తన సొంత డబ్బులతో మీడియా పెడుతున్నారని.. కాచుకోవాలని సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి ఇలా సవాల్ చేయడం ముందుగా ఈనాడు వాళ్లను కాకుండా సాక్షి వాళ్లను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే కొమ్ముకాయడానికి అడ్డగోలుగా వాదించుకోవడానికి.. కబ్జాల్ని సమర్థించుకోవడానికి సాక్షి మీడియా ఉండగా ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్లీ సొంత మీడియా గురించి ఎందుకు చెబుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది. తన భూకబ్జాలపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు సాక్షి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం ఆయన అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు.

కులగజ్జీ కూడా బయట పెట్టుకున్నారు !

దసపల్లా భూములను 22ఏ నుంచి తీసేయడం ద్వారా లాభపడింది చంద్రబాబు సామాజికవర్గం వారేనని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. విశాఖలో ఇతర వర్గాల జనం ఉన్నా ఆస్తులన్నీ చంద్రబాబు సామాజికవర్గం వారివేనని విచిత్రమైన లాజిక్ కూడా చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి చేస్తున్న భూకబ్జాలకు.. ఎలా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారో కానీ.. ఆ కులం వారి భూాముల్ని లాక్కున్నా తప్పులేదన్నట్లుగా ఆయన మాట్లాడటం మాత్రం అంద్రనీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా విజయసాయిరెడ్డి … విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో చేస్తున్న రాజకీయం అంతా దోపిడీనేనని పరోక్షంగా అంగీకరించారు. తన పై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా..ఎదురుదాడి చేయడం ద్వారా ఇది నిరూపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close