మైత్రీ మీద మ‌రింత భారం: విజ‌య్‌సేతుప‌తి పిండుడే పిండుడు

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ‘ఉప్పెన‌’ సినిమా నిర్మిస్తోంది మైత్రీ మూవీస్‌. మైత్రీ మూవీస్ అనే బ్యాన‌ర్ వాల్యూ, మెగా అల్లుడి సినిమా అనే విష‌యాలు మిన‌హాయిస్తే – ప్ర‌త్యేక‌మైన అంశాలేం ఈ సినిమాకి లేవు. అందుకే వీలైనంత స్టార్ వాల్యూ జోడించాల‌ని మైత్రీ త‌ప‌న పడింది. అందుకే విజయ్‌ సేతుప‌తిని రంగంలోకి దింపింది. ఈ సినిమాలో విజ‌య్ ప్ర‌ధాన విల‌న్‌. ఎప్పుడైతే విజ‌య్‌సేతుప‌తి ఎంట్రీ ఇచ్చాడో అనుకున్న‌ట్టే ‘ఉప్పెన‌’కు క్రేజ్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి పారితోషికం పేరుతో.. నిర్మాత‌ల్ని పిండుకోవ‌డం ప్రారంభించాడ‌ని టాక్‌.

ఈ సినిమా కోసం ముందుగా 2.5 కోట్ల‌కు ఒప్పందం జ‌రిగింది. అయితే మ‌ధ్య‌లో చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. కాల్షీట్లు పెరిగాయి. దాంతో విజ‌య్‌సేతుపతి పారితోషికాన్నీ పెంచేశాడు. మ‌రో 1.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. విజ‌య్‌ సేతుప‌తిపై తెర‌కెక్కించాల్సిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయి. అందుకే.. విజ‌య్ అడిగినంత ఇవ్వ‌క త‌ప్ప‌డం లేదు. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర 45 నిమిషాల వ‌ర‌కూ ఉంటుంద‌ని తెలుస్తోంది. విజ‌య్‌లాంటి స్టార్‌ని తీసుకొచ్చిన‌ప్పుడు స‌న్నివేశాల‌న్నీ చ‌క చ‌క తీసేసి, కాల్షీట్ల స‌మ‌స్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ద‌ర్శ‌క నిర్మాత‌ల‌దే. కానీ… సుకుమార్ శిష్యుడి సినిమా ఇది. సుకుమార్ లానే నిదానంగా తీయ‌డం మొద‌లెట్టాడు. దాంతో విజ‌య్‌సేతుపతి క్యాష్ చేసేసుకున్నాడు. ఈ సినిమాకి ముందు నుంచీ బ‌డ్జెట్ ఎక్కువైపోతోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి విజ‌య్‌సేతుప‌తి కూడా ఓ కార‌ణ‌మ‌య్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close