విజయసాయిరెడ్డి బీజేపీని వ్యతిరేకిస్తున్నారట..!

భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆ పార్టీ నేతలే తరచూ బయటపెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా.. వైసీపీ తరపున కార్యకలాపాలు మొత్తం చక్క బెట్టేస్తున్న విజయసాయిరెడ్డి… ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గుపడరు. అసెంబ్లీలో మోడీని చంద్రబాబు విమర్శించారని.. రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం దగ్గర్నుంచి… కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి… బహిరంగ మద్దతు తెలిపే వరకూ.. ఆయన ఏ విషయాన్ని దాచుకోలేదు. అవకాశం వస్తే మోడీపై తన అభిమానాన్ని కొండంతగా చూపించేందుకు మాటలను కూడా ప్రయోగిస్తారు. చివరికి… తను రాసిన ఓ పుస్తకాన్ని మోడీకి అంకితమవ్వడానికే.. ఏకంగా గుజరాత్ భాషలోనూ… ప్రచురిస్తున్నారు. ఇంతగా.. మోడీ, బీజేపీపై అభిమానం చూపించే విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నారు. బీజేపీని వైసీపీ వ్యతిరేకిస్తోందట.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం కాబట్టి.. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు గుర్తొచ్చాయన్నదానికి… విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కదా సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసిందని చెప్పుకొచ్చారు. అంటే.. అఫిడవిట్ వేసిన తర్వాతే.. బీజేపీని వ్యతిరేకించడం ప్రారంభించారన్న మాట. మరి అదే అఫిడవిట్లపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తూంటే.. కనీసం జగన్‌కు ఖండించడానికి కూడా నోరు రాలేదేం అనే అనుమానాలు అందరికీ రావడం సహజమే. అలాగే సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లలో కొత్త విషయాలేం లేవు.. అన్నీ మూడేళ్లుగా చెబుతున్నవేనన్న వాదన వైసీపీ నేతలు వినిపించారు. మరి మూడేళ్ల నుంచి ఇవే విషయాలు తెలిసి..ఎందుకు వ్యతిరేకించలేదు..?.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత… టీడీపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ… బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు సక్సెస్ అయింది. కానీ పరిస్థితులు మాత్రం తిరగబడ్డాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కనీసం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు ప్రజలకు అనిపించినా.. అది ఆ పార్టీ ఓటమికి కారణం కావడం ఖాయం. అందుకే ముందస్తు వేడి పెరుగుతున్న సమయంలో.. విజయసాయిరెడ్డి… తాము బీజేపీకి వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి కానీ..బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థికి కానీ మద్దతివ్వబోమంటున్నారు. వీరికి రెండు రెండు రాజ్యసభ సీట్లే కీలకమైతే… ఓ సినిమాలో డైలాగ్ చెప్పుకున్నట్లు…” మద్దతివ్వక చస్తారా..? మద్దతివ్వకపోతే చస్తారు..!” అన్నట్లు ఉంటుంది వారి పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close