జగన్ కేసుల ప్రస్తావన వస్తే విజయసాయికి పూనకమే..!

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను తక్షణం విచారించాలని.. ఆలస్యం చేయకూడదన్న అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో.. జగన్మోహన్ రెడ్డి అంశం హాట్ టాపిక్ అయింది. అయితే అది ఆయన కేసుల గురించి చర్చించడం కాదు.. అలా పేరు పెట్టి ఒకరి గురించి చర్చించడం కరెక్ట్ కాదన్న వాదన జరగడం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇందులో జోక్యం చేసుకుని మరింత రచ్చ చేయడంతో… విషయం కాస్తా హైలెట్ అయిపోయింది. మొదట… ఈ అంశంపై .. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన జగన్ పేరు పెట్టి… ఆయన కేసులు ఆలస్యమవుతున్నాయని ప్రస్తావించారు. అయితే.. చైర్మన్ వెంకయ్యనాయుడు మాత్రం.. ఈ చర్చ వ్యక్తులకు సంబంధించినది కాదని.. అలా వ్యక్తుల పేర్లు తేవొద్దని సూచించారు. వెంకయ్యనాయుడు అలా సూచించడంతో.. కనకమేడల సైలెంటయిపోయారు.

కానీ వెంటనే.. విజయసాయిరెడ్డి కల్పించుకున్నారు. కనకమేడల .. జగన్ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. ఇది.. చైర్మన్ వెంకయ్యనాయుడ్ని అసహనానికి గురి చేసింది. సభ్యుడి వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని.. విజయసాయిరెడ్డికి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సభా నియమాల గురించి.. తాను చెబుతున్నాని ఎందుకు కల్పించుకుంటారని ప్రశఅనించారు. చైర్మన్ సీరియస్ అవడంతో.. విజయసాయి కూర్చుండిపోయారు. సీబీఐ కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కనకమేడల చర్చలో అభిప్రాయాన్ని తర్వాత జగన్ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. మిగతా సభ్యులు కూడా అదే అభిప్రాయం చెప్పారు. మొదట కనకమేడల జగన్ ప్రస్తావన తెచ్చినప్పుడు… వెంకయ్యనాయుడు వారించారు. దాంతో మళ్లీ జగన్ ప్రస్తావన వచ్చేది కాదు. కానీ.. తాను కల్పించుకోకపోతే ఎట్లా అనుకున్నారేమో కానీ… విజయసాయిరెడ్డి కల్పించుకుని… చర్చ కాస్త కొనసాగేలా చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close