విజయసాయిరెడ్డి జగన్ రెడ్డికి దూరం జరిగినట్లు నటిస్తూనే, ఇటు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలు, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల అసహనం వెనుక అసలు కథ అందరికీ తెలుసు. కానీ తెలియదని విజయసాయి అనుకుంటున్నారు. తాను జగన్ చెంత నుంచి బయటకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వం తనపై కేసులను వేగవంతం చేయడం, శాంతి అనే అధికారిని జైలుకు పంపడం ఆయనకు నచ్చడం లేదు. అందుకే రెచ్చిపోతున్నారు.
విజయసాయిరెడ్డి లాంటి వాళ్లను చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎందరిని చూసి ఉండరు? తనను తాను ఒక తెలివైన కోవర్ట్ గా భావించుకుంటూ, టీడీపీలోకి లేదా కూటమిలోకి చొరబడాలని వీసారెడ్డి చేసుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఎదురుగా ఉన్నది చంద్రబాబు అని మర్చిపోయి, ఆయన అంత అమాయకంగా తనను నమ్మేస్తారని విజయసాయి అనుకుంటే అది ఆయన రాజకీయ అమాయకత్వమే అవుతుంది. ఐదేళ్ల పాటు ఉత్తరాంధ్రను దోపిడి చేయడమే కాకుండా, జగన్ అండతో సాగించిన దందాల చిట్టా మొత్తం రెడీగా ఉంది.
ఈడీ విచారణకు వెళ్లిన ప్రతిసారీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ, కొత్త సిద్ధాంతం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తనపై ఉన్న కేసుల తీవ్రతను తగ్గించుకోవడానికి ఇదొక షీల్డ్ లా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం నో సెటిల్మెంట్స్ అనే మూడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయనలో ఈ స్థాయిలో అసహనం పెరిగిందని, చివరకు ఢిల్లీ లాబీయింగ్ కూడా వర్కౌట్ కాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆయన ఉన్నారని .. అందుకే ఉన్మాదపు మాటలు మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
అయితే విజయసాయిరెడ్డికి మాత్రమే నోరు లేదని.. అందరికీ ఉంటుందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ వీసారెడ్డి మాట్లాడే ప్రతి మాటకు..చేతల్లోనే కౌంటర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి లెక్కలు ఇంకా చాలా బయటపడాల్సి ఉంది.
