పరువు-ప్రతిష్టలపై దాడి…! విజయసాయి బరి తెగించారా..?

సమాజంలో గౌరవ ప్రతిష్టలతో బతికిన వాళ్లు.. అవే తమ ఆస్తిపాస్తులనుకుంటారు. వాటికి దెబ్బపడితే.. బతకడం దండగనుకుంటారు. ఇలాంటి వారిని వైసీపీ అదే పద్దతిలో టార్గెట్ చేస్తోంది. కోడెలపై చిన్న చిన్న నేరాలు మోపి ఆత్మహత్య చేసుకునేలా చేయగిలిన వీరు.. ఇప్పుడు.. క్షత్రియులపై పడినట్లుగా కనిపిస్తోంది. మొన్న రఘురామకృష్ణరాజు పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి.. పోలీసులతో కొట్టించారు. ఇవాళ అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు నాడు ఆయన పూర్వికులపై విషం కక్కారు విజయసాయిరెడ్డి.

పూసపాటి వంశీయులపై విజయసాయిరెడ్డి అవాకులు.. చెవాకులు..!

పూసపాటి వంశీయులైన రాజులు చరిత్రలో ఏదో చేశారంటూ… విజయసాయిరెడ్డి వారిపై నిందలు వేస్తూ.. అసభ్యమైన పదజాలం వాడుతూ వరుసగా పెట్టిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి ఏవో కొన్ని పుస్తకాల్లో రాసిన వాటిని మార్కింగ్ చేసి.. అవే అసలైన చరిత్ర అన్నట్లుగా ప్రకటించి.. ఇష్టం వచ్చినట్లుగా గౌరవనీయులైన పూసపాటి వంశీయులపై గీత దాటి విమర్శలు చేస్తున్నారు. అశోక్ గజపతిరాజును ఆయన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తే… ఆయన రాజకీయం …ఆయన దగ్గరే ఉండాలి కానీ..తాత ముత్తాతల చరిత్రను వక్రీకరించి.. వాళ్లనూ.. నిందించడం ఏమిటన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిని న్యాయపోరాటం ద్వారా మళ్లీ సంపాదించుకున్నారు. ఇది విజయసాయిరెడ్డిని బాగా హర్ట్ చేసినట్లుగా ఉంది. ఆయన మాన్సాస్ ట్రస్ట్ భూములపై కన్నేశారో.. ఇంకేం ప్రయోజనం ఆశించారో కానీ.. ఆ తీర్పు ఆయనకు నిద్ర లేకుండా చేసినట్లుగా కనిపిస్తోంది. చైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతిరాజు పదవిచేపట్టినప్పటి నుండి శివాలెత్తిపోతున్నారు. ఆరు విచారణ కమిటీల్ని నియమించారు. అశోక్ గజపతిరాజును వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇప్పుడు ఆయన పూర్వీకుల మీదకు వెళ్తున్నారు. విజయసాయిరెడ్డికి ఇంత బరి తెగింపు ఎందుకన్న చర్చ ఇప్పుడు… ఉత్తరాంధ్ర మొత్తం నడుస్తోంది.

విషం చిమ్మి అశోక్‌ను మానసికంగా దెబ్బకొట్టే వ్యూహం..!

అశోక్ గజపతిరాజు పూర్వికులకు… చెప్పుకోదగినంత చరిత్ర ఉంది.రాజుల కాలంలో.. బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందో.. అప్పుడు జరిగింది.. చేసింది.. వారి దృక్కోణంలో… తప్పో.. ఒప్పో నిర్ధారించడానికి ఎవరికీ అర్హత లేదు. జరిగింది అనిచెప్పుకోవడమే చరిత్ర. అంతే కానీ.. వారు చేసింది తప్పు.. అని చెప్పడానికి.. విజయసాయిరెడ్డికి కానీ.. మరొ రాజకీయ నాయకుడికి కానీ లేదు. ఆ మాట కొస్తే చరిత్ర కారులకీ లేదు. కానీ.. రాజకీయాల కోసం పాతాళంలోకి దిగజారిపోతున్న విజయసాయిరెడ్డి… అశోక్‌గజపతిరాజుపై కోపంతో… వారి పూర్వీకుల్ని టార్గెట్ చేశారు. అశోక్ గజపతిరాజు పుట్టిన రోజునాడే… విజయసాయిరెడ్డి ఇలాంటి ట్వీట్లు చేయడం .. సాధారణం కాదు. పరువు తీసి మానసిక క్షోభకు గురి చేసే లక్ష్యంతోనే విజయసాయిరెడ్డి ఈ ట్వీట్లు పెడుతున్నరాని అంటున్నారు.

ఇంతకీ వైసీపీ.. విజయసాయి చరిత్రేమిటి..?

విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టిన తర్వాత.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఒకటే ప్రశ్న వేస్తున్నారు.. అసలు అశోక్‌గజపతిరాజును ప్రశ్నించడానికి వారి పూర్వికుల్ని నిందించడానికి నువ్వెవరు అనేప్రశ్నిస్తున్నారు. నీ తరతరాల చరిత్ర చెప్పమని అడుగుతున్నారు. రెండు తరాలవెనక్కి వెళ్తే ఎవరికి పుట్టారో తెలియని కుటుంబం నుంచి వచ్చారని… ఇప్పుడైనా గౌరవంగా బతుకుతున్నారా అంటే… అదీ లేదు. దేశంలో దొంగ లెక్కలు రాసే ఆడిటర్లలో నెంబర్‌ వన్‌గా పేరు తెచ్చుకుని పదహారు నెలలు జైల్లో ఉన్న చరిత్ర అని దుయ్యబడుతున్నారు. కానీ పరువనేది లేకుండా… పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినా… ఏదో ఘనకార్యం చేసినట్లుగా … వ్యవహరించే విజయసాయిరెడ్డి లాంటి వారి మనస్థత్వానికి తుడిపేసుకుంటారు. కానీ.. వంశాల పరంగా ఎంతో గౌరవంగా బతికిన వారిపై ఈ నిందలు… వారిని మానసిక క్షోభకు గురి చేస్తాయి. ఇది తెలిసే కుట్ర పూరితంగా వైసీపీ వ్యవహరిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close