కేసీఆర్ ప్రభుత్వం త్వరలోనే మహిళల దెబ్బ రుచి చూస్తుంది: విజయశాంతి

కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడల్లా వేగంగా స్పందిస్తూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టే నేతలలో విజయశాంతి ఒకరు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ మహిళా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై విజయశాంతి స్పందించారు. ఆమధ్య ఫారెస్ట్ అధికారి అయిన మహిళా ఉద్యోగి పట్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు దాడి చేశాడని, ఇప్పుడు మహిళా విద్యార్థిని పట్ల పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడని, కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల పట్ల పోలీసులు, నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విజయశాంతి సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అప్పుడు మహిళా అధికారి పై, ఇప్పుడు మహిళా విద్యార్థిని పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించిన కేసీఆర్ ప్రభుత్వం మహిళల తిరుగుబాటు ఎలా ఉంటుందో చూస్తుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఆమె ట్వీట్ చేస్తూ, “ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన సందర్భంగా మహిళా విద్యార్థుల పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా, అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉంది. ఈ ఘటనను చూసిన తర్వాత మహిళల విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ టీఆర్ఎస్ అధినాయకత్వానికి టీఆర్ఎస్ పాలకులకు ఎంత చులకన భావం మరోసారి అర్థమవుతోంది. ఓ అనామక సంస్థకు టెండర్లు అప్పగించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదు అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖకు చెందిన మహిళ ఉద్యోగిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా, కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంది. ఇప్పుడు ఆయుర్వేద కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ టీఆర్ఎస్ పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదు. మహిళల భద్రత కోసం షి టీంలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ మహిళ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రతిపక్షాలు చేసే విమర్శలను… వారి వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఈ విషయంలో లో మేము చేసే డిమాండ్ ని పట్టించుకోకపోతే… మహిళల నుంచి వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూడాల్సి ఉంటుంది” అని రాసుకొచ్చారు.

విజయశాంతి వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close