రాముల‌మ్మకు పార్టీలో ప్రాధాన్య‌త పెంచుతారా..?

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు విజ‌య‌శాంతి. స‌రిగ్గా తెలంగాణ ఏర్పాటుకు కొన్నాళ్ల ముందే తెరాస విడిచిపెట్టారు. కాంగ్రెస్ లో చేరారు. ఆ త‌రువాత‌, ఆమె కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ప‌నిచేసిందీ లేదు. ప్ర‌స్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. అని గుర్తు చేసుకోవాల్సిన ప‌రిస్థితి. కేసీఆర్ స‌ర్కారుపై పోరాటాల్లోగానీ, పార్టీ త‌ర‌ఫున జ‌రిగే ఎలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లోగానీ రాముల‌మ్మ పాల్గొన్న‌దీ లేదు. దాంతో కాంగ్రెస్ నేత‌లు కూడా ఆమెని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌దీ లేకుండా పోయింది. దీంతో ఓ ద‌శ‌లో ఆమె పార్టీ మార‌తారేమో, గులాబీ గూటికి చేర‌తారేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, ఉన్న‌ట్టుండి రాముల‌మ్మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు గురించి ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే… త్వ‌ర‌లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ప్రాధాన్య‌త పెంచే అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్ప‌టికే కావాల్సిన‌న్ని లుక‌లుక‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిని అధిగ‌మించి 2019 ఎన్నిక‌ల అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా టి. కాంగ్రెస్ ను సిద్ధం చేయాల‌న్న‌ది ఏఐసీసీ ల‌క్ష్యం. దీన్లో భాగంగా విజ‌య‌శాంతికి ప్రాధాన్య‌త పెంచే అవ‌కాశం ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, విజ‌య‌శాంతికి ఉన్న సినీ గ్లామ‌ర్ పార్టీకి ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఆలోచ‌న‌లో పార్టీ ఉంద‌ట‌. ఏఐసీసీ కార్య‌ద‌ర్శిని చేయాల‌నీ, పీసీసీ ప్ర‌చార క‌మిటీ బాధ్య‌త‌లు ఆమెకి అప్ప‌గించాల‌నే ప్ర‌తిపాద‌న తెర‌మీదికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు టి. కాంగ్రెస్ వర్గాల్లో ఈ చ‌ర్చ మొద‌లైంద‌ని అంటున్నారు. అంతేకాదు, ఇలాంటి క‌థ‌నాలు తెర‌పైకి రావ‌డంతో కొంతమంది కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నార‌ట‌!

పార్టీతో సంబంధం లేద‌న్న‌ట్టుగా ఉంటున్న విజ‌య‌శాంతిని బ‌తిమాలి మ‌రీ తీసుకుని రావ‌డం, ఉన్న నేత‌ల్ని కాద‌ని ఆమెకి ప్రాధాన్య‌త పెంచ‌డం ఇప్పుడు అవ‌స‌ర‌మా అని కొంద‌రు పెద్ద‌లు ఆఫ్ ద రికార్డ్ వాపోతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌డ‌చిన మూడేళ్ల‌లో పార్టీ కోసం ఆమె ఏం చేశార‌నీ, తెరాసపై తాము పోరాటం సాగిస్తున్నా క‌నీసం ఆమె నైతిక మ‌ద్ద‌తు ఇచ్చిన సంద‌ర్భం ఒక్క‌టీ లేద‌నీ పార్టీ వ‌ర్గాల్లో కొంద‌రు తీవ్రంగా ఆవేద‌న చెందుతున్న‌ట్టు చెబుతున్నారు. ఏదేమైనా, ఉన్న‌ట్టుండి రాముల‌మ్మ‌కు పార్టీలో ప్రాధాన్యం పెంచేస్తే, అది మ‌రో స‌మ‌స్యగా త‌యారై కూర్చోవ‌డం త‌థ్యం. ఎందుకంటే, ఇప్ప‌టికే పార్టీలో చాలా స‌మ‌స్య‌లున్నాయి. నేత‌ల మ‌ధ్య విభేదాలు రోడ్డెక్కి ఉన్నాయి. వాటిని ప‌రిష్క‌రించ‌డంపై ముందుగా హైక‌మాండ్ దృష్టి సారించాలి. అంతేగానీ, ఎవ‌రో కొంత‌మంది నేత‌ల ఇచ్చిన‌ స‌ల‌హాలూ సూచ‌న‌లూ వినేసి, రాములమ్మ అవ‌స‌రాన్ని గుర్తించిన‌ట్టుగా పెద్ద పీట వేస్తే చాలామంది నేత‌ల మ‌నోభావాలు దెబ్బ‌తింటాయన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close