ప‌వ‌న్ పేరుని బ‌య‌ట‌కు లాగారేంటి?

బాహుబ‌లి 2 ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్‌మానియానే కార‌ణమ‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓపెన్ గా చెప్ప‌డం ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇదే. ఎప్పుడైతే విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. బాహుబ‌లి 2 ఇంట్ర‌వెల్ సీన్‌కి ప‌వ‌న్ స్ఫూర్తినిచ్చాడ‌ని చెప్పాడో, అప్ప‌టి నంఉచి ప‌వ‌న్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకొంటున్నారు. బాహుబ‌లి 2 విజ‌యంలో ప‌వ‌న్‌కీ ఓ పాత్ర ఉంద‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఓ ప్ర‌ముఖ దిన పత్రిక‌లో వ‌చ్చిన ఈ ఇంట‌ర్వ్యూని ఎక్క‌డ‌కక్క‌డ షేర్ చేసుకొంటున్నారు. హ‌రీశ్ శంక‌ర్ సైతం.. త‌న ట్వీట్‌లో ఈ పేప‌ర్ క‌టింగ్‌ని హైలెట్ చేయ‌డం విశేషం.

హ‌ఠాత్తుగా ప‌వ‌న్ పేరు బ‌య‌ట‌కు తీసుకురావ‌డం వెనుక పెద్ద రీజ‌నే ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప‌వ‌న్ పేరు నిజాయ‌తీగానే ప్ర‌స్తావించినా.. కొంత‌మంది అభిమానులు, సినీ విశ్లేష‌కులు మాత్రం వీటి వెనుక పెద్ద లెక్క‌లే ఉండే అవ‌కాశాలున్నాయ‌ని గుస‌గుస‌లాడుకొంటున్నారు. బాహుబ‌లి 2 ఓ స్థాయిలో చెల‌రేగిపోతోంది. క‌నీవినీ ఎరుగ‌న‌వి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. అయితే చాలా చోట్ల ఈ సినిమాకి ప‌వ‌న్ ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ ఫ్యాన్స్ అన‌ధికారికంగా ఈ సినిమాని బ్యాన్ చేశారు. వాళ్లంద‌రినీ ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఈ సినిమాని మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డానికి ప‌వ‌న్ పేరు బ‌య‌ట‌కు తీసుకొచ్చార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాక‌పోతే… ఈ సినిమాకి ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ పేరుని వాడుకొనేంత అవ‌స‌రం లేదు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కి రాజ‌మౌళికి తెలిసిన‌న్ని టెక్నిక్కులూ తెలీవు. సో.. ఆయ‌న మాత్రం నిజాయ‌తీగానే స్ఫూర్తినిచ్చిన సంగ‌తి ఒప్పుకొన్నారు. దానికి నానార్థాలూ, పెడ‌ర్దాలూ తీయ‌క‌పోవ‌డ‌మే ఉత్తమం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com