దెయ్యాల వెంట ప‌డుతున్న ద‌ర్శ‌కుడు

విక్ర‌మ్ కె.కుమార్ ఎప్పుడూ ఇన్నోవేటివ్ కాన్సెప్టుల‌తో క‌థ‌లు సిద్ధం చేసుకొంటుంటాడు. 13 బి చూస్తే… విక్ర‌మ్ ఆలోచ‌న‌లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థ‌మ‌వుతాయి. మ‌నంలో కూడా త‌న స్ర్కీన్ ప్లేతో అద్భుత‌మైన మాయాజాలం చేశాడు విక్రమ్‌. ఇప్పుడు సూర్య‌తో 24 చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా క‌థ కూడా గ‌మ్మత్తుగానే ఉండ‌బోతోంది. మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు విక్ర‌మ్‌తో సినిమాలు చేయ‌డానికి క్యూ క‌ట్టారిప్పుడు. అయితే విక్ర‌మ్ మ‌న‌సు మాత్రం 13బి సినిమాపైనే ఉంది. ఆ చిత్రానికి సీక్వెల్ తీయాల‌ని, ఈసారి బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టాల‌నిచూస్తున్నాడు విక్ర‌మ్‌.

13బికి సీక్వెల్‌గా… 13సి, 13డీ అనే రెండు క‌థ‌ల్ని రెడీ చేసుకొన్నాడు విక్ర‌మ్‌. త్వ‌ర‌లో 13సీని బాలీవుడ్లో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. కేవ‌లం 3 నెల‌ల్లో ఈ ప్రాజెక్టు ఫినిష్ చేసి తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేయాల‌నే స‌న్నాహాల్లో ఉన్నాడు. తొలి భాగంలో మాధ‌వ‌న్‌, నీతూ చంద్ర జంట‌గా న‌టించారు. ఈ సీక్వెల్‌లో మాధ‌వ‌న్ ని కొన‌సాగిస్తూ నీతూ చంద్ర స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని ఎంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. స్టార్ హీరోలు సినిమా తీయమంటే.. ఈ డైరెక్ట‌ర్ ఏంటో దెయ్యాల వెంట‌ప‌డుతున్నాడు. ఎవ‌రి టేస్ట్ వాళ్ల‌ది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com