బోయ‌పాటితో ప‌నిచేస్తే ఆ కిక్కే వేర‌ప్పా: రామ్ చర‌ణ్‌

హీరోల్ని అభిమానుల‌కు న‌చ్చేలా చూపించ‌డం ఎలానో బోయ‌పాటి కి బాగా తెలుసు. ఏ హీరోతో ప‌నిచేస్తే ఆ హీరోకి అభిమానిలా మారిపోతారాయ‌న‌. బోయ‌పాటి స‌క్సెస్ సీక్రెట్ అదే కావొచ్చు. అందుకే `మిగిలిన హీరోలంతా.. త‌మ కెరీర్‌లో ఒక్క‌సారైనా బోయ‌పాటితో ప‌నిచేయాలి` అంటూ.. స‌ల‌హా ఇస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇన్ని సినిమాల‌కు ప‌నిచేశా గానీ, సెట్లో టీమ్‌ని ఆయ‌నంత క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎవ‌రూ ఉంచ‌లేద‌ని కితాబు అందించాడు చ‌ర‌ణ్‌.

‘‘నాలుగేళ్ల క్రితమే ఈ చిత్రం కథ విన్నా. ఆయన ఒక లైన్‌ చెప్పారు. వెంటనే సినిమా తీసేస్తారేమో అనుకున్నా. ఆయన ఆలోచ‌న‌లు వేరేలా ఉన్నాయి. బోయపాటి బ్రాండ్‌ అందరికీ తెలిసిందే. అబ‌ద్దాన్ని కూడా నిజంలా న‌మ్మిస్తారాయ‌న‌. నాలుగేళ్లు ఎంతో కష్టపడి, ఆలోచించి అభిమానులకు న‌చ్చేలా చరణ్‌తో ఓ మంచి సినిమా తీయాల‌ని కష్టపడి తయారుచేసిన చిత్రమిది. ఆయనతో పనిచేస్తే ఆ కిక్కే వేరప్పా. నేను కొత్త అవతారంలో కన్పిస్తానా లేదా? అనేది చిత్రంలో చూడండి. కానీ హిట్టు కొట్టిన‌ప్పుడు క‌లిగే ఆనందం.. ఆయ‌న సెట్లో క‌నిపించేది. ఆయ‌న్ని క‌లిసి ఇంటికెళ్తే.. ‘బోయ‌పాటి గారిని క‌లిసి వ‌స్తున్నావా’ అని ఇంట్లో వాళ్లు సుల‌భంగా గుర్తించేవారు. ఆయ‌న్ని కలిస్తే నాకు ఏదో తెలియని శక్తి వస్తుంది. ఈ చిత్రం నాకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది” అన్నాడు చ‌ర‌ణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close