విన‌య‌విధేయ రామా.. ‘ట్రెండింగ్‌’లో లేదు క‌దా మామా!

24 గంట‌ల క్రితం విడుద‌లైన `విన‌య విధేయ రామా` టీజ‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మెగా ఫ్యాన్స్‌కి చ‌ర‌ణ్ వీరోచిత విన్యాసాలు బాగా న‌చ్చేసినా… మిగిలిన‌వాళ్లు మాత్రం ఇది `రోటీనే క‌దా` అంటున్నారు. సింహా, లెజెండ్‌, స‌రైనోడు, జ‌య జాన‌కీ నాయ‌క టీజ‌ర్ల‌తో పోలుస్తున్నారు. హింస మితిమీరిపోయింద‌ని, టైటిల్‌కీ, టీజ‌ర్‌కి సంబంధ‌మే లేద‌ని.. నొస‌లు చిట్లిస్తున్నారు. ఏదేమైనా.. `విన‌య విధేయ రామా` 24 గంట‌ల్లో 15 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌ని సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృంద‌మే ప్ర‌క‌టించింది. 24 గంట‌ల్లో 15 మిలియ‌న్ల వ్యూస్ అంటే.. గొప్ప విష‌య‌మే. కాక‌పోతే ఒక్క‌టే అనుమానం. ఇన్ని వ్యూస్ వ‌చ్చిన టీజ‌ర్ క‌చ్చితంగా యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ఉండాలి. కానీ టాప్ 10లో ఎక్క‌డా `విన‌య విధేయ రామా` క‌నిపించ‌డం లేదు. నిన్న‌నే విడుద‌లైన `కేజీఎఫ్‌` అనే డ‌బ్బింగ్ సినిమా కూడా ట్రెండింగ్‌లో చోటు ద‌క్కించుకుంది. చ‌ర‌ణ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇన్ని మిలియ‌న్స్ అని చెప్పుకుంటున్న టీజ‌ర్ క‌చ్చితంగా టాప్ 3లో ఉండాలి. కానీ.. టాప్ 20లో కూడా ఈ టీజ‌ర్‌కి స్థానం ద‌క్క‌లేదు. మ‌రి ఈ వ్యూస్‌లో మ‌త‌ల‌బేంటో.. చిత్ర‌బృందానికే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close